Home /News /trending /

65 YEAR OLD MAN WHO BECAME A MUSICIAN FOR HIS MOTHER HAPPINESS IN CHINA SNR

కన్నతల్లి ఆనందం కోసం చిన్న పిల్లాడైపోయాడు..65ఏళ్ల వయసులో ఎవరైనా అలా చేస్తారా..

PHOTO CREDIT:YOUTUBE

PHOTO CREDIT:YOUTUBE

China: కన్నతల్లి కోసం అతను చిన్న పిల్లాడైపోయాడు. 96ఏళ్ల వయసున్న తల్లిని నవ్వించడానికి మ్యుజిషియన్‌ అవతారమెత్తాడు. 30ఏళ్ల క్రితం మర్చిపోయిన విద్యను తన 65ఏట తిరిగి కొనసాగిస్తున్నాడు. తల్లిని సంతోష పెడుతూ వార్తల్లో నిలిచాడు.

అతను ఓ మంచి కొడుకు. అంతే కాదు గొప్ప మెజిషియన్ కూడా. తన తల్లి ముఖంలో సంతోషం చూడటం కోసం తన వయసును సైతం మర్చిపోయి ఆమెను ఆనందింపజేస్తున్నాడు. ఆరు పదుల వయసు దాటినప్పటికి ఇంకా చిన్నపిల్లాడిలా వెరైటీ ప్రదర్శలు, వింత , వింత ఫీట్స్ చేస్తూ అమ్మను కడుపుబ్బనవ్విస్తున్నాడు. అసలు ఇదంతా చేయడానికి కారణం ఏమిటీ.. అనే విషయం తెలుసుకోవాలంటే చైనాలో ఉన్న ఆ గ్రేట్ మెజిషియన్ (Magician)గురించి ముందుగా చెప్పుకోవాలి. ? 65ఏళ్ల వయసు కలిగిన ఆ వృద్ధుడి పేరు వాంగ్‌ యోంగ్‌కింగ్ (Wang Yongqing). సెంట్రల్ చైనా (China)లోని హెనాన్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. 96ఏళ్ల వృద్దురాలైన తల్లి కూడా వాంగ్‌తోనే ఉంటోంది. తల్లి కోసం ప్రాణాలు ఇచ్చేంత గొప్ప మనిషి వాంగ్. అందుకే కాటికి కాలు చాచిన వయసులో ఉన్న తల్లి కళ్లలో ఆనందం చూడటంతో కోసం నిత్యం పరితపిస్తున్నాడు.

వృద్ధాప్యం అతని శరీరానికి కాదు..
చైనాలోని ఓ మారుమూల గ్రామంలో వ్యవసాయం చేసుకొని తల్లిని పోషించుకుంటున్నాడు 65సంవత్సరాల వయసు కలిగిన వాంగ్‌. 30ఏళ్ల క్రితం మ్యాజిక్ నేర్చుకున్నాడు. దాంతోనే ప్రదర్శలు ఇస్తూ డబ్బులు సంపాధించే వాడు. అనుకోకుండా వాంగ్ తండ్రి చనిపోవడంతో తల్లి తీవ్ర మనోవేదనకు గురైంది. అతడ్ని తలుచుకుంటూ ఏడూస్తూ ఉండేది. తల్లి రోజు కన్నీరు కార్చడం చూడలేక వాంగ్‌ ఆమెను నవ్వించడం కోసం దాదాపు 30ఏళ్ల క్రితం నేర్చుకున్న మ్యాజిక్‌ని ఆమె ముందు ప్రదర్శించడం మొదలుపెట్టాడు. చిన్నపిల్లాడిలా పిల్లి మొగ్గలు వేయడం, తలపై గిన్నెల్ని బ్యాలెన్స్ చేయడం, చిన్న చిన్న సైకిళ్లను తొక్కుతూ తల్లిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆమెను ఆనందింపజేస్తూ వచ్చాడు.

తల్లి కోసం ఏమైనా చేసే కొడుకు..
ఇంద్రజాల ప్రదర్శనలోని రకరకాల ఫీట్స్‌ని ముప్పై ఏళ్ల క్రితమే మర్చిపోయాడు వాంగ్. మధ్యలో ఎక్కడా ప్రదర్శలు ఇవ్వలేదు. వాటిని ప్రాక్టీస్ కూడా చేయలేదు. కాని ఇప్పుడు తల్లి కోసం అవన్నీ చేయాల్సి రావడంతో చిరునవ్వుతోనే వాటిని ప్రదర్శిస్తూ ఆదర్శవంతమైన కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు. ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా అద్బుతమైన మ్యాజిక్‌ షోలు చేస్తూ గ్రామస్తుల చేత కూడా శభాష్ అనిపించుకుంటున్నాడు వాంగ్.

మ్యాజిక్‌కి ఉన్న పవర్ అది..
ఎదుటి వాళ్ల సంతోషం కోసం తన సుఖాన్ని త్యాగం చేసే వాళ్లు అరుదుగా ఉండరు. అలాంటిది వృద్ధాప్యం మీదపడిన తర్వాత కూడా తల్లిని సంతోష పెట్టాలన్న ఆలోచనతో ఇలాంటి కష్టతరమైన విన్యాసాలు చేస్తున్నాడు వాంగ్. మ్యూజిక్‌కి రాళ్లు కరుగుతాయన్న సామెతలో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ..మ్యాజిక్‌కి మాత్రం ఎన్ని కష్టాల్లో ఉన్న వాళ్లైనా కాస్తంత సరదాగా నవ్వుకుంటారని ఈఘటన చెప్పకనే చెబుతోంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Chain snatching, China, Old man

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు