నాకు పెళ్లి చేయకుంటే చచ్చిపోతా.. కరెంటు స్తంభమెక్కిన వృద్ధుడు.. ముసలోడే కానీ మహానుభావుడు..

స్తంభమెక్కిన వృద్ధుడు

తాను ఆరేళ్లుగా ఒంటరి తనాన్ని భరించలేకపోతున్నాని.. ఎవరో ఒకరితో పెళ్లి చేయాలని సోబ్రాన్ కోరుతున్నాడు. ఒక తోడు ఉంటే అదే చాలని వేడుకుంటున్నాడు.

 • Share this:
  పెళ్లి చేయాలంటూ ఓ వృద్ధుడు కుటుంబ సభ్యులపై కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నాడు. కానీ వారు ఒప్పుకోక పోవడంతో కరెంట్ స్తంభం ఎక్కి హల్ చల్ చేశాడు. పెళ్లి చేస్తారా? చచ్చిపోవాలా? అని బెదిరించాడు. రాజస్థాన్‌లో ఈ ఘటన జరిగింది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ధోల్‌పూర్‌కు చెందిన సోబ్రాన్ సింగ్ అనే 60 ఏళ్ల వృద్ధుడు ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడు. ఐదేళ్ల క్రితమే భార్య చనిపోయింది. మొదట బాగానే ఉన్నాడు. కానీ నెలలలు గడిచే కొద్దీ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాడు. అందుకే తనకు రెండో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులను కొంతకాలంగా కోరుతున్నారు. ఐతే ఈ వయసులో నీకు పెళ్లి అవసరమా? అని వారు వారిస్తూ వస్తున్నారు.

  నిత్యం ఇంట్లో దీని గురించే గొడవ. తనకు పెళ్లి చేయాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నాడు సోబ్రాన్ సింగ్. అతడికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పలువురు మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు. ఐతే వీరందరికీ సోబ్రాన్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అతడు ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. ఈ వయసులో రెండో పెళ్లి ఏంటి.? అని తిడుతున్నారు. ఈ క్రమంలోనే సోబ్రాన్ సింగ్ రెండు రోజుల క్రితం 11కేవీ కరెంట్ స్తంభం ఎక్కాడు. తనకు పెళ్లి చేయకుంటే కరెంట్ వైర్లను తాకి చనిపోతానని బెదిరించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


  సోబ్రాన్ సింగ్ కరెంట్ స్తంభం ఎక్కిన వెంటనే.. కుటుంబ సభ్యులంతా భయపడిపోయారు. వెంటనే ఎలక్ట్రిక్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్‌కు ఫోన్ చేసి ఆ లైన్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం ఓ వ్యక్తి స్తంభం ఎక్కి ఆ వృద్ధుడిని కిందకు దించేశాడు. తాను ఒంటరి తనాన్ని భరించలేకపోతున్నాని.. ఎవరో ఒకరితో పెళ్లి చేయాలని సోబ్రాన్ కోరుతున్నాడు. ఒక తోడు ఉంటే అదే చాలని వేడుకుంటున్నాడు. మరి ఇప్పటికైనా తన తండ్రి కోరికను మన్నించి ఆయన కుమారులు, కుమార్తెలు పెళ్లి చేస్తారో లేదో చూడాలి.
  Published by:Shiva Kumar Addula
  First published: