హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Wedding Viral: ఓ దళిత జంట పెళ్లికి 60మంది పోలీసుల భద్రత .. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

Wedding Viral: ఓ దళిత జంట పెళ్లికి 60మంది పోలీసుల భద్రత .. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

DALIT COUPLE(Photo Credit:Youtube)

DALIT COUPLE(Photo Credit:Youtube)

Wedding Viral : ఉత్తరప్రదేశ్‌లో ఓ దళిత జంట పెళ్లి వేడుకలో పోలీసులే బంధు,మిత్రులుగా వ్యవహరించారు. ఒకరిద్దరు కాదు..60మంది పెళ్లి వేడుక మొదలైన దగ్గర నుంచి పెళ్లి కొడుకును ఊరేగించే వరకూ పోలీసులే ఆ జంటకు సెక్యూరిటీ కల్పించారు. ఎందుకో తెలుసా..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Sambhal, India

ఎక్కడైనా పెళ్లి జరిగితే ఆ వేడుక దగ్గర బంధువులు, మిత్రులు, ఆత్మీయులతో కళకళలాడిపోతూ ఉంటుంది. కాని ఉత్తరప్రదేశ్‌(Uttar pradesh)లో ఓ దళిత జంట(Dalit couples)పెళ్లి వేడుకలో పోలీసులే బంధు,మిత్రులుగా వ్యవహరించారు. ఒకరిద్దరు కాదు..60మంది పెళ్లి వేడుక మొదలైన దగ్గర నుంచి పెళ్లి కొడుకును ఊరేగించే వరకూ పోలీసులే ఆ జంటకు సెక్యూరిటీ (Security)కల్పించారు. ఇంత మంది పోలీసులు వచ్చారంటే పెళ్లి కొడుకో ..పెళ్లి కూతురో పోలీస్ డిపార్ట్‌మెంట్‌(Police Department)లో ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్నారనుకుంటే మీరు పొరపాటు బడినట్లే. మరి ఎందుకు అంత మంది వచ్చారో తెలుసా..

ఆ డ్రెస్ వేసుకుందని..మాజీ మిస్ క్రొయేషియాకి భారీ జరిమానా,జైలు శిక్ష?

దళిత జంట పెళ్లికి 60పోలీసుల భద్రత..

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా గున్నౌర్‌ ప్రాంతంలోని లోహమై గ్రామంలో రవినా , రామ్‌కిషన్ అనే ఇద్దరు ప్రేమికులు వివాహం పేరుతో ఒకటయ్యారు. అయితే వాళ్ల పెళ్లికి అబ్బాయి తరపు పెద్దలు అంగీకరించలేదు. ఎందుకంటే అమ్మాయి దళితురాలు కావడంతో రామ్‌కిషన్ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. కాని ప్రేమించుకున్న ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని పోలీసుల్ని ఆశ్రయించారు. అంతే దళితురాలైన అమ్మాయి కుటుంబ సభ్యుల కోరిక మేరకు 60మంది పోలీసులు పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటి దగ్గర కాపలా కాశారు.

Coconut : ఈ కొబ్బరిబోండాం ధర రూ.592.. ఎందుకో తెలుసా?

భారీగా ఊరేగింపు..

పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో 44మంది కానిస్టేబుళ్లు, 14మంది ఎస్‌ఐలు, ఒక సీఐ, మరొక ఇన్స్‌పెక్టర్, మరో సర్కిల్ ఆఫీసర్‌ అందరూ అమ్మాయి కుటుంబ సభ్యులపై అబ్బాయి తరపు బంధువులు దాడి చేయుకండా జాగ్రత్తగా పెళ్లి జరిపించారు. అయితే పెళ్లికి ఎస్కార్ట్‌గా వ్యవహరించడమే కాదు తర్వాత దంపతుల్ని గుర్రంపై ఊరేగిస్తూ డీజే మ్యూజిక్‌ మధ్య డ్యాన్సులు చేశారు. దళిత జంటను ఈవిధంగా ఊరేగించడానికి అగ్రవర్ణాలు అంగీకరించకపోవడంతో పోలీసుల పర్మిషన్‌తో బారాత్ నిర్వహించారు.

వైరల్ అవుతున్న వార్త..

పెళ్లి కుమార్తె మేనమామ అభ్యర్ధనతో పోలీసులు ఈ పెళ్లికి భద్రత కల్పించడంతో పాటు ఊరేగింపును కూడ ఘనంగా నిర్వహించారు. అటుపై పోలీసు సిబ్బంది అంతా కలిసి డబ్బులు సేకరించి 11వేల రూపాయలను కానుకగా వధువరులకు అందజేశారు. ఓ దళితురాలి పెళ్లి పోలీసు బలగాల మధ్య జరగడం చర్చనీయాంశమైంది. ఆ పెళ్లి వేడుక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

First published:

Tags: Uttar pradesh, VIRAL NEWS, Viral Video, Wedding

ఉత్తమ కథలు