ఆరేళ్ల బాలిక తాను.. చనిపోయి మరో ఐదుగురికి అవయవ దానం (Organ donor) చేసి, వారి ప్రాణాలను నిలిపింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. కాగా, నోయిడాలో ఆరేళ్ల బాలిక రోలీ ప్రజాపతిపై (roli prajapati) గుర్తుతెలియని దుండగులు ఏప్రిల్ 27 న కాల్పులు జరిపారు. దీంతో బాలికను తల్లిదండ్రులు వెంటనే బాలికను గాయం తీవ్రత కారణంగా వెంటనే కోమాలోకి వెళ్లి, ఢిల్లీలోని (Delhi) ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు (Aiims) తరలించారు. అప్పటి నుంచి బాలిక కోమాలోకి వెళ్లిపొయింది. డాక్టర్లు బాలికను కాపాడటానికి శాయశక్తుల ప్రయత్నించారు. కానీ బుల్లెట్లు బాలిక తలలోనికి దూసుకుపొవడం వలన తలలో రక్తం గడ్డకట్టింది. పలు చోట్ల తీవ్రరంగా గాయలయ్యాయి.
దీంతో బాలిక బ్రెయిన్ డేడ్ కు (Brain dead) గురైనట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఘటనపై సీనియర్ (AIIMS) న్యూరో సర్జన్ డాక్టర్ దీపక్ గుప్తా మాట్లాడుతూ.. బాలిక తల్లిదండ్రులకు బ్రెయిన్ డేడ్ విషయాన్ని తెలిపారు. తలలో రక్తం గడ్డకట్టడం వలన మెదడు పూర్తిగా దెబ్బతిందని పేర్కొన్నారు. అదే విధంగా ఆస్పత్రుల వైద్యులు బాలిక కుటుంబ సభ్యులకు అవయవ దానం గురించి తెలిపారు.
కాసేపటికి బాలిక కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు. దీంతో డాక్టర్లు వాటికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. బాలిక కాలేయం, మూత్రపిండాలు, కార్నియాలు మరియు గుండె కవాటం రెండూ విరాళంగా ఇవ్వబడతాయి. వీటిని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న మరో ఐదుగురికి ఆపరేషన్ చేసి వారి ప్రాణాలు కాపాడారు. కాగా, ఈ అవయవ దానంతో, రోలీ ప్రజాపతి ఢిల్లీలోని ఎయిమ్స్ చరిత్రలో అతి పిన్న వయస్కురాలైన దాతగా నిలిచారు.
తన పెంపుడు కుక్క మరణించిన తర్వాత.. వర్ధంతి కార్యక్రమాన్ని (Dog Death Anniversary) నిర్వహించి గొప్పమనస్సు చాటుకున్నాడు.
ఈ సందర్భంగా దాదాపు 100 కుక్కలను పిలిచి వాటికి భోజనం పెట్టాడు.హుగ్లీలోని చందన్ నగర్‌కు చెందిన తరుణ్ ఘోష్ దస్తీదార్కు జంతువులంటే ఎంతో ఇష్టం. తన ఇంట్లో కుక్కలను పెంచుకుంటున్నాడు. వాటికి పేర్లు పెట్టి.. సొంత కుటుంబ సభ్యుడిలా చూసుకుంటున్నాడు. ఐతే గత ఏడాది మే 15న బిచ్చు అనే కుక్క అనారోగ్యంతో మరణించింది. తమకు ఎంతో ఇష్టమైన బిచ్చు మరణించడంతో కుటుంబమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. బిచ్చు మరణించి ఏడాది పూర్తవడంతో.. మొదటి వర్ధంతిని నిర్వహించారు. మనిషికి వర్ధంతి కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారో.. అచ్చం అలాగే బిచ్చు వర్ధంతిని కూడా నిర్వహించారు. ఆదివారం ఘోష్ దస్దీదార్ తమ ఇంట్లో కుక్క చిత్రపటానికి పూలమాల వేశారు. ఒక్కటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యల దండలతో దాని చిత్రపటాలను అలంకలరించారు. అనంతరం కాసేపు మౌనం పాటించి.. దానిని స్మరించుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.