Home /News /trending /

6 YEAR OLD JODHPUR MAN SWALLOWS 63 COINS OF RS 1 DOCTORS REMOVE IT IN 2 DAY LONG OPERATION PAH

OMG: ఇదేందిరా నాయన.. 63 ఒక రూపాయి నాణేలు మింగాడు.. కారణం తెలిస్తే నోరెళ్ల బెడతారు..

వ్యక్తి మింగిన కాయిన్స్

వ్యక్తి మింగిన కాయిన్స్

Rajasthan: వ్యక్తికి కొన్నిరోజులుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో.. అతడిని కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

మనలో చాలా మందికి నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉంటుంది. మరికొందరు ఏదో కొన్ని పదార్థాలు తరచుగా నములుతుంటారు. అయితే.. అప్పుడప్పుడు.. కొంత మంది అనుకొకుండా కాయిన్ లు మింగటం, ఏదైన చిన్న వస్తువులను ప్రమాదవశాత్తు మింగటం జరుగుతుంటుంది. ఇలాంటి సందర్భాలలో వ్యక్తి ప్రాణాలమీదకు కూడా వచ్చిన సంఘటనలు అనేకం వార్తలలో నిలిచాయి.  తరచుగా చిన్న పిల్లలను ఆడుకుంటున్నారని చిన్నపిల్లలు వదిలేస్తారు. అప్పుడు వారు.. కాయిన్ లను మింగిన ఘటనలు కూడా జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులు కొన్నిసార్లు తమ ప్రాణాలను కూడా కొల్పోయారు. మరికొన్నిసార్లు.. ఆపరేషన్ తో వెంట్రుక వాసిలో ప్రమాదాల నుంచి బయటపడ్డారు. తాజాగా, మరొక ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. రాజస్థాన్ లో (Rajasthan)  జోధ్ పూర్ లో షాకింగ్ సంఘటన వెలుగులోనికి వచ్చింది. జోధ్ పూర్ కు చెందిన 36 ఏళ్ల జోధ్‌పూర్ వ్యక్తి రూ. 63 నాణేలను మింగేశాడు. అతను కడుపు నొప్పితో బాధపడుతుంటే.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు.. అతడిని కడుపుకు ఎక్స్ రే చేశారు. దానిలో ఒక లోహపు గడ్డ ఉండటాన్ని గుర్తించారు. దాదాపు.. రెండు రోజుల పాటు కష్టపడి దాదాపు.. 63 నాణేలను (Coins swallows)  బయటకు తీశారు. దీనిపై గల కారణాలపై వైద్యులు ఆరా తీశారు. కొన్నిరోజులుగా సదరు వ్యక్తి డిప్రెషన్ కు గురౌతున్నాడని అందుకు.. నాణేలను మింగుతున్నాడేమో అంటూ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.



ఇదిలా ఉండగా ఒకటో తరగతి బాలిక తన అమ్మపై ప్రధానికి ఫిర్యాదు చేసింది.

ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) ఒక ఫన్నీ ఘటన జరిగింది. కన్నౌజ్ జిల్లాలోని చిబ్రమౌ పట్టణానికి చెందిన కృతి దూబే అనే బాలిక తన బాధను ప్రధాని మోదీకి (PM Modi)  చెప్పుకుంది. ఈ ఘటన వైరల్ గా (viral news) మారింది. కొన్నిరోజులుగా క్లాస్ లో తన పెన్సిల్, ఎరేజర్ ఎవరో దొంగిలిస్తున్నారని చెప్పింది. దీంతో ఇంట్లో కొత్త పెన్సిల్ అడిగితే, మా అమ్మ కొట్టిందని చెప్పుకొచ్చింది.
 అంతే కాకుండా.. మ్యాగీ ధర కూడా పెరిగిందని చెప్పింది. దీనిపై బాలిక తండ్రి విశాల్ దూబె రియాక్ట్ అయ్యారు. ఆయన న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఇది నా కూతురు మన్ కీ బాత్ అన్నారు. స్కూల్ లో పెన్సిల్ పొగొట్టుకున్నందుకు, ఆమె తల్లి తిట్టడంతో నా కూతురు కోపంగా ఉందని అన్నారు. కాగా, ఈ లేఖ ప్రస్తుతం నెట్టింట (Social media)  వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Coins, Rajasthan, VIRAL NEWS

తదుపరి వార్తలు