హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral news: నానమ్మే అమ్మగా మారింది .. కొడుకు బిడ్డను తన కడుపులో మోసిన 56ఏళ్ల మహిళ వీడియో ఇదిగో

Viral news: నానమ్మే అమ్మగా మారింది .. కొడుకు బిడ్డను తన కడుపులో మోసిన 56ఏళ్ల మహిళ వీడియో ఇదిగో

(Photo:Instagram)

(Photo:Instagram)

Viral news: 56సంవత్సరాల మహిళ..సరోగసి విధానంలో కొడుకుకి బిడ్డను కని అప్పగించింది. తన కొడుక్కి ఐదో సంతానం కావాలన్న కోరిక తీర్చడానికి కోడలు అనర్హురాలు కావడంతో తన గర్భంలోనే మనవరాలిని బిడ్డగా పెంచి కొడుకు చేతిలో పెట్టింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

బిడ్డను తొమ్మిది నెలలు కడుపులో మోయలేక అద్దె గర్భంపైన ఆధారపడుతున్న ఈరోజుల్లో తన కొడుకు బిడ్డను కడుపులో పెట్టుకొని ప్రాణం పోసింది ఓ నాయనమ్మ. వినడానికి కొత్తగా ఉన్నప్పటికి ఇది అక్షరసత్యం. అమెరికా(America)లోని ఉటా (Utah) ప్రాంతంలో నివసిస్తున్న 56సంవత్సరాల మహిళ..సరోగసి(Surrogacy)విధానంలో కొడుకుకి బిడ్డను కని అప్పగించింది ఆ తల్లి. అప్పటికే నలుగురు సంతానం కలిగిన తన కొడుక్కి ఐదో సంతానం కావాలని ముచ్చట పడ్డాడు. అయితే కోడలి గర్భసంచి తొలగించడంతో తన గర్భంలోనే మనవరాలిని బిడ్డగా పెంచి కొడుకు చేతిలో పెట్టింది.

US | TANA: న్యూయార్క్‌ కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్ సిబ్బందికి "తానా"వస్తు సాయం

నానమ్మే అమ్మయ్యింది..

సరోగతి విధానంలోనే ఆశ్చర్యకరమైన వార్త ఒకటి అమెరికాలో వెలుగుచూసింది. ఉటా ప్రాంతంలో నివసిస్తున్న వెబ్‌ డెవలపర్‌గా పనిచేస్తున్న జెఫ్‌ హాక్‌ కేంబ్రియా అనే మహిళను వివాహం చేసుకున్నాడు.ఈ దంపతులకు నలుగురు పిల్లలు పుట్టారు. అయితే జెఫ్‌ హాక్‌కి మరో బిడ్డ కావాలని కోరిక ఉంది. అయితే హుక్ భార్య గర్భసంచిని డాక్టర్లు తొలగించడంతో వేరే మార్గం లేక అద్దె గర్భం ద్వారా బిడ్డకు జన్మనివ్వాలనుకున్నారు దంపతులు. ఈవిషయంలో బయట వ్యక్తులను ఎక్కువగా సంప్రదిస్తారు. కాని జెప్‌హాక్ దంపతులు బిడ్డ కోసం మదనపడటం చూసి జెఫ్‌హాక్ తల్లి నాన్సీ హాక్ సరోగసీ విధానంలో తన కొడుకు సంతాన్ని తన గర్భంలో మోసేందుకు ఇష్టపూర్వంగా ఒప్పుకుంది.

కొడుకుకి మనవరాలిని కనిచ్చింది..

56సంవత్సరాల నాన్సీ హాక్ ఉటా టెక్ యూనివర్సిటీలో పని చేస్తున్నారు. కోడలికి గర్భసంచి తొలగించడంతో నాయనమ్మ గర్భంలోకి ఫలదీకరణం చెందిన అండాలను ప్రవేశపెట్టారు. 9నెలల పాటు తన గర్బసంచిలో కొడుకు బిడ్డను మోసిన నాన్సీ హాక్ నవంబర్ 2వ తేదిన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకుకి మనవరాలిని కని ఇచ్చిన మాతృమూర్తి చేసిన త్యాగం, ఆమె పంచిన ప్రేమను చూసి కొడుకు జెఫ్ హాక్, కోడలి కేంబ్రియా తమ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమన్నారు.

వింత వార్త ..

ఐదో సంతానంగా కలిగిన పాపకు హన్నా అని పేరు పెట్టారు. ఇంకా విచిత్రం ఏమిటంటే గర్భంలో ఉండగానే కొడుకు, కోడలికి నాన్సీ హాక్ పుట్టబోయేది ఆడపిల్లేనని ముందుగానే చెప్పడంతో వారి మరింత ఆనందానికి లోనయ్యామని తెలిపారు.

First published:

Tags: International news, Trending news

ఉత్తమ కథలు