నదిపై బ్రిడ్జి మాయం... దొంగల పనే అంటున్న స్థానికులు

Bridge Vanishes : ఎక్కడైనా చోరీ జరిగినప్పుడు డబ్బో, నగలో ఎత్తుకెళ్తారు. అదే గుడిలో అయితే హుండీ పట్టుకుపోతుంటారు. మరి వంతెనను ఎత్తుకుపోయిందెవరు? అదెలా జరిగింది?

Krishna Kumar N | news18-telugu
Updated: June 7, 2019, 8:51 AM IST
నదిపై బ్రిడ్జి మాయం... దొంగల పనే అంటున్న స్థానికులు
బ్రిడ్జి ఏమైపోయింది
Krishna Kumar N | news18-telugu
Updated: June 7, 2019, 8:51 AM IST
ఇదో నమ్మలేని నిజం. రష్యాలోని ఒక్త్యాబ్రస్కాయాలో జరిగిందీ ఘటన. 56 టన్నుల బరువైన వంతెన... 75 అడుగుల ఎత్తులో ఉంటుంది. కింద అంబా నది ప్రవహిస్తోంది. అలాంటి బ్రిడ్జి ఉన్నట్టుండి మాయమైంది. స్థానికులు షాకయ్యారు. ఇది దొంగలపనే అంటున్నారు. చిత్రమేంటంటే, బ్రిడ్జిలోని మధ్య భాగాన్ని ఎత్తుకుపోయారు. భూమిపై ఉండే వంతెన మొదటి, చివరి భాగాలు మాత్రం అలాగే ఉన్నాయి. రష్యాలోని సోషల్ మీడియా సైట్ వీకేలో ఈ బ్రిడ్జి మాయమైందన్న వార్త మే నెలలో వచ్చింది. మొదట ఎవరూ నమ్మలేదు. మీడియా అక్కడకు వెళ్లి చూసింది. ఆశ్చర్యపోయింది. ఇదెలా జరిగి ఉంటుందని స్థానికుల్ని అడిగితే, దొంగలే ఎత్తుకుపోయి ఉంటారని అంటున్నారు. అయితే మే 16న వీకే సైట్‌లో బ్రిడ్జికి సంబంధించి కొత్త ఫొటో కనిపించింది. అందులో బ్రిడ్జి ముక్కలై నదిలో పడిపోయినట్లు ఉంది.

vanish,bridge vanishes in russia,bridge,vanished,vanishes,75-feet bridge vanishes without a trace in russian town!,bridges,magic,ship bridge,disappear,natural bridge on earth,russky bridge,wooden bridge,man made bridge,russian bridge,village bridge,crimean bridge,steven bridges tv,victoria memorial vanish,steven bridges magician,places that vanish,vanish underwater,steven bridges magic,వంతెన,బ్రిడ్జి,మాయం,వంతెన మాయం,
వంతెనను ఎత్తుకుపోయారా?

మే 26న వచ్చిన ఏరియల్ ఫొటోలను చూస్తే, నది నీటిలో బ్రడ్జికి సంబంధించిన ఆనవాళ్లు ఏవీ లేవు. వంతెన శిథిలాల్ని ఎవరో పట్టుకుపోయి ఉంటారనే వాదన వినిపిస్తోంది. ప్రకృతి విపత్తులకు విరిగిపోయేంత బలహీనంగా ఆ వంతెన లేదని తెలిసింది. అసలు మే నెలలో ప్రకృతి విపత్తులు ఏవీ రాలేదని స్థానికులు చెబుతున్నారు.

vanish,bridge vanishes in russia,bridge,vanished,vanishes,75-feet bridge vanishes without a trace in russian town!,bridges,magic,ship bridge,disappear,natural bridge on earth,russky bridge,wooden bridge,man made bridge,russian bridge,village bridge,crimean bridge,steven bridges tv,victoria memorial vanish,steven bridges magician,places that vanish,vanish underwater,steven bridges magic,వంతెన,బ్రిడ్జి,మాయం,వంతెన మాయం,
నదిలో వంతెన శిథిలాలు
ప్రస్తుతం వంతెన ఎలా మాయమైందన్నదానిపై కిరోవ్స్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వంతెన అయికువెన్, లొవొరెంజో గ్రామాలను కలిపేది. కొన్నేళ్ల కిందట దీనిపై రాకపోకలు నిలిపేశారు.
First published: June 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...