ఒక్కకొక్కరికి ఒక్కో అభిరుచి ఉంటుంది. వాటిని బయటపెట్టేందుకు సిగ్గు, బిడియం వంటి వాటిని పక్కనపెడితే వాళ్లలోని టాలెంట్ ఎంత పేరు తెచ్చిపెడుతోందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే ఎవరిలో ఉండే అభిరుచి, టాలెంట్‌ని అడ్డుకట్ట వేయకూడదని ఓ 52సంవత్సరాల(52Years old) మహిళ నిరూపించింది. ముఖ్యంగా సోషల్ మీడియా(Social media)లో అలాంటి వాళ్లను బయటి ప్రపంచానికి తెలియజేస్తూ వాళ్లను ఓ సెలబ్రిటీలుగా ప్రత్యేక గుర్తింపు ఇస్తోంది. నీరుసైని(Neerusaini) అనే ఓ 52ఏళ్ల మహిళ చేసిన డ్యాన్స్(Dance) వీడియో(Video) ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వయసు పెరుగుతోందని భయపడేవాళ్లకు, వయసు పెరిగినా వాళ్లలో ఉత్సాహం తగ్గదని రుజువు చేస్తోంది.
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో ..
ఇన్‌స్టాగ్రామ్ నీరుసైని అనే ఓ మహిళ వీడియోను ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ వీడియోలో బాలీవుడ్‌లో కరీనాకపూర్ డ్యాన్స్ చేసిన సూపర్ హిట్ సాంగ్ 'చమ్మక్ చల్లో' పాటకు నీరుసైని అదిరిపోయే డ్యాన్స్ చేసి నెటిజన్ల హృదయాల్ని దోచుకుంది. నడి వయస్సు దాటిన మహిళ ఏమాత్రం బిడియం లేకుండా హుషారుగా డ్యాన్స్ చేయడం చూసి కుర్రాళ్లు ఆశ్చర్యపోతున్నారు. నీరుసైని చేసిన ఒక్క డ్యాన్స్ వీడియోకు 1.43 లక్షల లైక్‌లు వచ్చాయి. అంటే టాలెంట్, అభిరుచికి వయసు ఏమాత్రం అడ్డురావని ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది.
View this post on Instagram
52 ఏళ్ల పెద్దమ్మ కరీనా కపూర్‌లా ..
సినిమాలో 'చమ్మక్ చల్లో'సాంగ్‌కు కరీనా కపూర్ రెడ్ శారీ కట్టుకొని హుషారుగా వేసిన స్టెప్పులను సేమ్ టు సేమ్ చేసింది నీరుసైనీ. ఇప్పుడు అదే ఎర్రటి చీర కట్టుకున్న 52 ఏళ్ల మహిళ కరీనాకపూర్‌కు ప్రత్యక్ష పోటీ ఇస్తోందని, జనాలు కూడా కరీనా కంటే బాగానే డ్యాన్స్ చేసిందంటున్నారు. ఎందుకంటే కరీనా చిన్న వయసులో కుదుపులకు వేలాడ దీసి డ్యాన్స్‌ని అద్భుతంగా చేసింది, కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, 52 ఏళ్ల మహిళ తన చురుకుదనంతో అందర్ని కట్టిపడేస్తోంది.
డ్యాన్స్‌కి ఫిదా అవుతున్న నెటిజన్లు ..
వైరల్ వీడియోలో ఎర్రటి చీర, తెల్ల జుట్టుతో డ్యాన్స్ చేసిన మహిళ వయసు నిజంగా 52ఏళ్లు అంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. జుట్టుకు తెల్లరంగు వేసుకొని డ్యాన్స్ చేసిందా ఏంటీ అనే సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు నెటిజన్లు. అయితే వీడియో వైరల్ కావడమే కాదు లేడీ డ్యాన్సర్‌కి అంతే రేంజ్‌లో కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. వయసు డ్యాన్స్‌కే కాదు దేనికి అడ్డుకాదని ఈ ఓల్డ్ లేడీ నిరూపించిందని కితాబిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Classical dancer, Viral Video