52 YEAR OLD WOMAN FOUND MYSTERIOUS WINE BOTTLE AT THE BEACH IN ENGLAND HERE IS HER REAL LIFE THRILLING STORY NK
Mysterious Wine Bottle: రహస్య వైన్ బాటిల్.. సముద్ర నీటిలో 4800 కి.మీ. ప్రయాణించింది
ప్రతీకాత్మక చిత్రం
Mysterious Wine Bottle: అదో పాత వైన్ బాటిల్. సముద్ర నీటిలో కొట్టుకుంటూ వచ్చి... ఓ తీరంలో ఆగింది. అక్కడ 52 ఏళ్ల ముసలామెకు అది దొరికింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం.
Mysterious Wine Bottle: అది ఇంగ్లండ్‌లోని వేల్స్ తీరం. 52 ఏళ్ల అమందా టిడ్మార్ష్ (Amanda Tidmarsh)... తీరంలో అలా అలా వెళ్తూ... ఓ వైన్ బాటిల్ చూసి థ్రిల్ అయ్యింది. చాలా మంది లాగే ఆమె కూడా ఆ బాటిల్‌ని చూడగానే... "అరే ఏంటిది... వైన్ బాటిల్... ఇక్కడుందేంటి... భలే ఉంది" అనుకుంది. లోలోపల ఆనందపడుతూ... ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆ బాటిల్‌ను ఇంటికి తీసుకెళ్లింది. నిజానికి అమందా... తన రెండు కుక్కలతో సరదాగా బీచ్‌లో తిరిగింది. కొంత దూరం వెళ్లాక... సముద్రం (sea) అలల నుంచి తీరంవైపు వస్తున్న బాటిల్‌ని చూసింది. ఆ బాటిల్‌కి ఓ ఆల్చిప్ప లాంటిది అతుక్కొని ఉంది. దాన్ని బట్టీ... అది చాలా కాలంగా సముద్రంలోనే ఉందని ఆమెకు అర్థమైంది.
ఇంటికి తీసుకెళ్లిన అమందా... వెంటనే దాన్ని ఏమీ చెయ్యలేదు. దాన్ని అలా ఓ చోట పెట్టి... దాన్ని చూస్తూ... అరుదైన వస్తువు దొరికినట్లు ఫీలవుతూ సంబరపడింది. తన కోడలు మాటీకి దాన్ని ఫొటోలు తీసి పంపింది. అవతలి నుంచి మ్యాటీ... ఆలస్యమెందుకు ఓపెన్ చేసి లోపల ఏముందో చూడండి అని చెప్పింది. దాంతో... అమందా.. బాటిల్ ఓపెన్ చేసి చూసింది. అందులో ఏమీ లేవు. వైన్ అస్సలు లేదు. కానీ... ఓ చిరిగిన లేఖ (Letter) ఉంది. ఆ లేఖను బయటకు తీసి చూడగా... అందులో కొన్ని వివరాలతోపాటూ... "దయచేసి ఈ బాటిల్ మీకు అందినట్లుగా... కింది ఈమెయిల్-ఐడీకి సమాచారం పంపండి" అని ఉంది. ఇది పంపినది నేనే.. అని కింద ఈమెయిల్-ఐడీ ఉంది.
తన అనుభవాన్ని బీబీసీ (BBC)కి చెప్పిన అమందా... ఆ బాటిల్ చూడటం తనకు థ్రిల్‌గా అనిపించింది అని చెప్పింది.
బాటిల్లోని ఆ లేఖను బట్టి... ఆ లెటర్... కెనడాలో సముద్రంలో వదిలేసినట్లు అర్థమైంది. జాన్ గ్రాహమ్ (John Graham) అనే వ్యక్తి... 2020 నవంబర్‌లో ఆ బాటిల్‌ను సముద్రంలోకి విసిరేశాడు. అమందా అతనికి మెయిల్ పంపింది కానీ అటు నుంచి రిప్లై రాలేదు. ఆసక్తికర విషయం ఏంటంటే... కెనడా నుంచి 4,800 కిలోమీటర్లు సముద్ర నీటిలో ప్రయాణించి ఆ బాటిల్... ఇంగ్లండ్‌లోని అమందాని చేరింది.
ఇదంతా తలచుకుంటూ ఆమె ఇది తన జీవితంలో మర్చిపోలేని ఘటన అంటోంది. తనలాగా ఇంకెవరికైనా జరిగిందా అని నెటిజన్లను కోరుతోంది. ఐతే... రెండో ప్రపంచ యుద్ధ (Second world war) సమయంలో నౌకల్లో యుద్ధాలు చేసిన చాలా మంది... తాము చనిపోయే ముందు... పేపర్లలో విషయం రాసి... వాటిని బాటిళ్లలో మడతపెట్టి ఉంచి... బాటిల్ మూత పెట్టి... సముద్రంలో విసిరేసేవారు. ఆ బాటిళ్లు కొంతకాలానికి ఒడ్డుకు చేరేవి. అలా ఫలానా నౌక సముద్రంలో మునిగిపోయిందని గుర్తించేవారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.