ప్రేమ ఎప్పుడు పుడుతుందో ..ఎలా పుడుతుందో ..ఎక్కడ పుడుతుందో ఎవ్వరికి తెలియదు. ఇంటర్(Inter student)ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయి..50ఏళ్ల లెక్చరర్(Lecturer)తో ప్రేమలో పడింది. ఇంగ్లీష్ ట్యూషన్ క్లాసులకు వెళ్లిన సమయంలో ఉపాధ్యాయుడికి మనసు ఇచ్చింది. వినడానికి కాస్త వెరైటీగా ఉన్నప్పటికి ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఈ లవ్ స్టోరీ (Love story)పెళ్లి వేడుకగా మారింది. శ్వేత(Sweetha)అనే ఇంటర్ మీడియట్ స్టూడెంట్‌ని సంగీత్‌కుమార్(Sangeet Kumar)అనే 50ఏళ్ల లెక్చరర్ ప్రేమించుకున్నారు. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారానికి రోస్రా సబ్ డివిజన్‌లోని ఓ ఆలయంలో ఇద్దరూ హిందూ సాంప్రదాయపద్దతిలో వివాహం చేసుకున్నారు. సినిమా స్టైల్లో జరిగిన ఈపెళ్లికి స్థానికులు అతిధులు, పెళ్లికి సాక్షులుగా నిలిచారు.
గురు,శిష్యుల పవిత్ర ప్రేమ..
ఉత్తరప్రదేశ్ సమస్తిపూర్‌లోని రోస్డా సబ్-డివిజన్ ప్రాంతంలో వెరైటీ లవ్ స్టోరీ పెళ్లితో సుఖాంతమైంది. రోస్రాబజార్‌లో నివసించే సంగీత్‌కుమార్ పోలీస్ స్టేషన్ సమీపంలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. తన కోచింక్ సెంటర్‌కు ఇంగ్లీష్ నేర్చుకునేందుకు 20సంవత్సరాల శ్వేత అనే అమ్మాయి వస్తుండేది. శ్వేత సంగీత్‌కుమార్ చెప్పే పుస్తకంలోని పాఠాలతో పాటు అతనితో ప్రేమ పాఠాలు నేర్చుకుంది. అంతే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి బలమైన బంధంగా పెనవేసుకుంది. మనసులు కలవడంతో వయసును లెక్కచేయకుండా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఒకే ప్రాంతంలో ఒకే కాలనీలో నివసిస్తున్న స్టూడెంట్, టీచర్ స్థానికంగా ఉన్న ఆలయంలో ప్రేమ వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో శ్వేతను తన భార్యగా చేసుకున్నాడు లెక్చరర్ సంగీత్‌కుమార్. గుడిలో సింపుల్‌గా జరిగిన ఈ ప్రేమ వివాహానికి చుట్టుపక్కల వారు సాక్షులుగా మారారు.
30ఏళ్ల పెద్దవాడ్ని పెళ్లాడిన యువతి..
50సంవత్సరాల సంగీత్ కుమార్‌కి గతంలోనే వివాహం జరిగింది. భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకోవాలని తనకు సరైన అమ్మాయి కోసం వెదుకుతున్నాడు. ఈక్రమంలోనే తన స్టూడెంట్ ప్రేమిస్తున్నానని చెప్పడంతో కాదనలేకపోయాడు. ఆమెను తన జీవితభాగస్వామిగా చేసుకున్నాడు. గుడిలో జరిగిన వీరిద్దరి ప్రేమ పెళ్లికి కోర్టు ద్వారా చట్టబద్ధత కల్పించేందుకు రిజిస్టార్ ఆఫీసులో వివాహం జరిపించారు అధికారులు.
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
ఇద్దరి మధ్య 30సంవత్సరాల వయసు తేడా ఉన్నప్పటికి ప్రేమే వాళ్లిద్దర్ని కలిపింది. ప్రేమ వివాహం విషయంలో లెక్చరర్ సంగీత్ కుమార్, స్టూడెంట్ శ్వేత ఇదే మాటను చెప్పారు. ఈ అపూర్వ వివాహానికి సంబందించిన వీడియోను స్థానికులు ఫోన్‌లో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఈ దంపతులు తాళి కట్టిన తర్వాత ఏడడుగులు వేస్తూ చిరునవ్వులు చిందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National News, Uttar pradesh, Viral Video