ఛత్తీస్‌గఢ్‌లో మొసలికి అంత్యక్రియలు..

ఛత్తీస్‌గఢ్‌లోని బావామొహాత్రా గ్రామంలో 130 సంవత్సరాల మొసలికి గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. సుమారు 500 మందికి పైగా గ్రామస్తులు హాజరయ్యారు.

news18-telugu
Updated: January 10, 2019, 3:08 PM IST
ఛత్తీస్‌గఢ్‌లో మొసలికి అంత్యక్రియలు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: January 10, 2019, 3:08 PM IST
ఓ పెద్ద ట్రాక్టర్. దాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. అందులో ఓ పెద్ద శవపేటిక లాంటి దానిమీద ఓ మొసలి ఉంది. ఔను. మీరు విన్నది నిజమే. ఆ మొసలికి వారు అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామం మొత్తం ఊరేగింపు నిర్వహించి, ఊరి చివర ఉన్న కొలనువద్ద పూడ్చిపెట్టారు. విచిత్రంగా ఉన్నా.. ఇది నిజంగా జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని బేమాత్రా జిల్లాలో ఉన్న బావామొహాత్రా గ్రామంలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. 130 సంవత్సరాల వయసున్న ఆ మొసలి చనిపోయింది. ఆ మొసలి పొడవు సుమారు మూడు మీటర్లు. మొసలి చనిపోయిన విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు వచ్చి.. దానికి పోస్ట్ మార్టం నిర్వహించి, మళ్లీ గ్రామస్తులకు అప్పగించారు.

ఆ మొసలి గురించి గ్రామస్తులు కథలు కథలుగా చెబుతారు. ఆ మొసలి గ్రామం శివారులోని ఓ కొలనులో ఉండేది. గ్రామంలోని ఎవరికీ హాని చేసేది కాదట. ఒకవేళ ఎవరైనా పిల్లలు నీటిలో దిగి ఈత కొడుతున్నా సరే.. వారికి ఎలాంటి హాని చేయకుండా ఉండేదట. ఒకవేళ ఎవరైనా యువకులు.. సరదాగా ఆ మొసలి వరకు ఈదుకుంటూ వెళితే.. అదే వారి నుంచి తప్పుకొని మరో చోటకు వెళ్లిపోతుందట. ఇంత మంచి మొసలి కాబట్టే, దాన్ని వారు జాగ్రత్తగా చూసుకున్నారు. దానికి అన్నం, పప్పు, కూరలు కూడా పెట్టేవారట. దానికి గంగారం అని పేరు పెట్టుకుని ఎంచక్కా చూసుకున్నారు. ఆ మొసలి వల్ల ఆ గ్రామానికి కూడా పేరొచ్చింది. చుట్టుపక్కల గ్రామాల వారు బావామొహాత్రా గ్రామస్తులు అని కాకుండా, ‘మొసలి గ్రామవాసులు’గా పేరు పొందారు.

First published: January 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...