Home /News /trending /

5 YEARS OLD KERALA BABY SERAH MARIA CHARIT CREATES RECORDS BY TELLING 59 DINOSAURS AND 12 MOONWALKERS NAMES IN ONE MINUTE HSN

అయిదేళ్ల పాపే కదా అని తేలిగ్గా తీసేయకండి.. ఆమె చెప్పేది వింటే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టడం ఖాయం..!

Serah Maria Charit (Image Credit: YouTube)

Serah Maria Charit (Image Credit: YouTube)

అయిదంటే ఐదేళ్ల వయసున్న పాప రికార్డులు సృష్టిస్తోంది. ఒకే ఒక్క నిమిషంలోనే ఆ బాలిక చేస్తున్న పనికి అంతా ఫిదా అయిపోతున్నారు. ఆమె చెబుతున్న విషయాలు విని అంతా నోరెళ్లబెడుతున్నారు.

    అయిదేళ్ల వయసున్న పిల్లలు మహా అంటే ఏం చేస్తుంటారు. చుట్టుపక్కల ఉండే పిల్లలతో ఆటలాడుతుంటారు. ఇంట్లో ఉండే పిల్లులు, పప్పీలతో పోట్లాడుతుంటారు. అది కావాలి, ఇది కావాలంటూ తల్లిదండ్రుల వద్ద మారాం చేస్తారు. ముద్దు ముద్దు మాటలతో మాయ చేస్తూ పేరెంట్స్ ను ఫుల్ ఖుషీ చేస్తారు. అప్పుడే అంగన్ వాడీ పాఠశాలకో, ఎల్కేజీ, యూకేజీయో చదువేందుకు రెడీ అవుతుంటారు. అంతే కానీ పెద్ద పెద్ద మేథావులకే సాధ్యం కాని విషయాలను చెప్పగలరా? అంతర్జాతీయ విషయాలను అలవోలకగా వివరించగలరా? డైనోసార్ల పేర్లను ఒక్కొక్కటిగా చెబుతూ పోగలరా? అసాథ్యమే కాదు. కానీ, ఓ అయిదేళ్ల బాలిక ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది. కేవలం ఒకే ఒక్క నిమిషంలో అద్భుతాన్ని సృష్టిస్తోంది.

    కేరళ రాష్ట్రానికి చెందిన ఓ సెరాహ్ మరియా చరిత్ అనే అయిదేళ్ల బాలిక యూఏఈలోని షార్జాలో ఓ పాఠశాలలో చదువుకుంటోంది. ఈ పాప ఇప్పుడు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. అంత గొప్ప పని అయిదేళ్లలోనే ఈ పాప ఏం చేసిందనే కదా మీ డౌటు. సింపుల్ గా ఓ ప్రశ్న. చంద్రుడిపై అడుగుపెట్టిన వ్యోమగాముల పేర్లను చెప్పండి? అంటే మీరు ఏమని సమాదానం ఇస్తారు.? నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అనీ, మహా అయితే ఎడ్విన్ బజ్ అల్డ్రీన్ అనీ రెండంటే రెండు పేర్లనే చెప్పగలుగుతారు.
    ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..

    కానీ ఈ అయిదేళ్ల పాప మాత్రం ఏకంగా 12 పేర్లను టకాటకా చెప్పేస్తుంది. అంతే కాదండోయ్, ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 59 రకాల డైనోసార్ల పేర్లను చెప్పగలదు. ఈ 59 డైనోసార్ల పేర్లు, 12 మంది వ్యోమగాముల పేర్లను కేవలం ఒక్క నిమిషంలోనే ఈ పాప చెప్పగలగడం రికార్డే కదా మరి. అందుకే ఈ పాప టాలెంట్ ను మెచ్చి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ స్వయంగా వచ్చి రికార్డును నమోదు చేసుకుంది. ప్రపంచ మ్యాప్ లో దేశాలను కూడా ఈ పాప గుర్తించగలదట. రెండున్నరేళ్ల వయసులోనే దాదాపు 110 దేశాల పేర్లను చెప్పగలిగిందట.
    ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Dubai, Saudi Arabia, Trending videos, VIRAL NEWS, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు