
5 ఏళ్ల చెన్నై చిచ్చర పిడుగు... 13 నిమిషాల్లో 111 బాణాలు రిలీజ్... రివర్సులో వేలాడుతూ... (Image credit: ANI)
మన దేశంలో చాలా మందికి అద్భుతమైన టాలెంట్ ఉంటుంది. ప్రేరణ, ప్రోత్సాహం లేక అది మరుగున పడిపోతుంది. ఆ చిన్నారి టాలెంట్ చూసి... నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
పిట్ట కొంచెం - కూత ఘనం... కాదు కాదు... పిల్ల కొంచెం - ఆర్చెరీ ఘనం... అందాం... చెన్నైకి ఐదేళ్ల బాలిక... సంజన... ఇప్పుడు ఇండియాలో సెన్సేషన్. అవును మరి... మామూలు రికార్డా అది... జస్ట్ 13 నిమిషాల 15 సెకండ్లలో... 111 బాణాల్ని సందించింది... అది కూడా తల కిందకూ... కాళ్లు పైకి పెట్టి... రివర్సులో వేలాడుతూ... సంధించింది. అలనాటి సవ్యసాచి... అర్జునుణ్ని గుర్తు చేసింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం... ఆగస్ట్ 15న ఈ చిన్నారి ఈ ప్రయత్నం చేసింది. భారత ఆర్చరీ అసోసియేష్ ఆఫ్ ఇండియా (AAI) సెక్రెటరీ జనరల్.. ప్రమోద్ చందూర్కర్... ఈ ఈవెంట్‌కి చీఫ్ గెస్టుగా వచ్చారు. ఆయనతోపాటూ... ఢిల్లీ ఆర్చరీ అసోసియేష్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్దేవ కూడా హాజరయ్యారు. అలాగే.. AAI జడ్జెస్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ జోరిస్ ఈ ఈవెంట్‌ని ఆన్లైన్లో చూశారు. అలాగే... కాంటినెంటల్ జడ్జ్ ఆఫ్ వరల్డ్ ఆర్చరీ అధ్యక్షతన ఏర్పడిన జడ్జీల ప్యానెల్... ఈ ఈవెంట్‌ను పర్యవేక్షించింది.
సాధారణంగా... ఏ ప్రపంచ పోటీలోనైనా, నేషనల్ పోటీలోనైనా... ట్రైనింగ్ పొందిన ఆర్చర్లు... ఆరు బాణాల్ని... నాలుగు నిమిషాల్లో సంధిస్తారు. అంటే... 20 నిమిషాలకు... 30 బాణాల కింద లెక్క అని సంజనకు ట్రైనింగ్ ఇచ్చిన సిహాన్ హుస్సైనీ తెలిపారు. తన స్టూడెంట్ సాధించిన రికార్డును గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వారు పరిశీలిస్తారని తెలిపారు.
తన చిట్టి తల్లి సాధించినది చూసి... తండ్రి ప్రేమ్... ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై ఏటా ప్రతీ ఇండిపెండెంట్స్ డే నాడు... తన కూతురు ఓ కొత్త రికార్డ్ నెలకొల్పుతుందన్నారు. పదేళ్లు వచ్చే వరకూ అలా చేయిస్తానన్నారు. పదేళ్ల తర్వాత ఆమెను 2032 ఒలింపిక్స్‌కి ట్రైనింగ్ ఇప్పిస్తానన్నారు. దేశానికి చాలా గోల్డ్ మెడల్స్ తెప్పింది... దేశం గర్వపడేలా చేయిస్తానన్నారు.
సోషల్ మీడియాలో సంజనాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ట్విట్టర్లో యూజర్లు... తెగ మెచ్చుకుంటున్నారు. చిన్నారి టాలెంట్ అందరికీ తెగ నచ్చేస్తోంది. ఆమెను రికర్వ్ బౌ ట్రైనింగ్‌కి పంపాలని ఓ యూజర్ కోరారు. ఈ చిన్నారి ద్వారా ఇండయన్ ఆర్చరీ... ప్రపంచంలో టాప్‌కి వెళ్తుందని మరో యూజర్ ఆశించారు.
Published by:Krishna Kumar N
First published:January 12, 2021, 19:00 IST