మణిపూర్‌లోని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చెందిన జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు శుక్రవారం అధికార బిజెపిలో చేరారు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. కాగా, బీజేపీలో ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేల విలీనానికి స్పీకర్ అంగీకరించడం పట్ల మణిపూర్ అసెంబ్లీ కార్యదర్శి కె.మేఘజిత్ సింగ్ సంతకం చేసిన ప్రకటించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం మూడింట రెండు వంతుల కంటే ఎక్కువగా ఉన్నందున, వారి ఫిరాయింపు చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడుతుందని సమాచారం.
ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పోటీ చేసిన 38 నియోజకవర్గాల్లో ఆరింటిని గెలుచుకుంది. బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలు ఖజాయ్‌కిషన్, ఎన్ సనాతే, ఎండీ అచాబ్ ఉద్దీన్, మాజీ డీజీపీ ఎల్‌ఎం ఖౌటే, తంజామ్అ రుణ్‌కుమార్. Mr Khaute, , Mr అరుణ్ కుమార్ గతంలో BJP టిక్కెట్లపై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నించారు. కానీ పార్టీ తిరస్కరించిన తర్వాత JDUలో చేరారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తోంది.
ఇదిలా ఉండగా చిత్రదుర్గాలోని మురుగా మఠాధిపతి(Murugha Math) డాక్టర్ శివమూర్తి మురుగా శరణారావు(64)కు కర్ణాటకలో మంచి పేరుంది.
ఎందరో ప్రముఖులు మురుగ రాజేంద్ర మఠానికి వస్తుంటారు. కొద్దిరోజుల క్రితమే రాహుల్‌గాంధీ ఈ మఠంలో శివదీక్ష తీసుకున్నారు. గతంలో అమిత్‌షా, నడ్డా లాంటి ప్రముఖులు కూడా మఠాన్ని సందర్శించారు. లింగాయత్ సామాజిక వర్గంలో ఈ మఠానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఆగస్టు 26న మురుగా మఠం ఆధీనంలోని అక్కమదేవి విద్యాసంస్థల్లో చదువుకుంటూ హాస్టల్‌లో ఉంటున్న ఇద్దరు మైనర్ అమ్మాయిలు..అయితే ఆగస్టు 26న మైసూరులోని ఓ స్వచ్ఛంద సంస్థ(NGO)ని ఆశ్రయించారు.
చాలా ఏళ్లుగా డాక్టర్ శివమూర్తి తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ బాలికలు ఆరోపించారు.. ఆశీర్వాదం పేరుతో తమను ప్రతివారం పిలిపించిన స్వామీజీ..తమపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత బాలికలు ఆరోపించారు. ఎన్జీవో సాయంతో బాలికలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి డాక్టర్ శివమూర్తిపై కేసు పెట్టారు. ఇద్దరు బాలికల్లో ఒకరు దళిత కమ్యూనిటీకి చెందినవారు కావడంతో స్వామీజీ శివమూర్తిపై పోస్కో(POSCO)తో పాటు ఎస్సీ-ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసు నమోదుచేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manipur, Nitish Kumar, VIRAL NEWS