Home /News /trending /

5 MORE JUNIOR MINISTERS QUIT BORIS JOHNSONS GOVERNMENT PAH

సంక్షోభంలో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం.. 5 కు చేరిన రాజీనామా చేసిన మంత్రుల సంఖ్య..

బోరిస్ జాన్సన్ (ఫైల్)

బోరిస్ జాన్సన్ (ఫైల్)

Britan:  బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజకీయంగా తీవ్ర గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆర్థిక మంత్రి రిషి సునాక్ రాజీ నామా చేసిన విషయం తెలిసిందే.

బ్రిటన్ లో (Britan)  రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని బోరిస్ పై తమకు విశ్వాసం లేదని, నిన్న రిషి సునాక్, సాజిద్ జావిద్ ఇద్దరు మంత్రుల రాజీనామా చేశారు. ఇక తాజాగా, శిశు, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విల్ క్విన్, రవాణా శాఖా మంత్రి లారా ట్రాట్ కూడా తమ పదవి నుంచి వైదోలగనున్నట్లు బుధవారం ట్విటర్ వేదికగా ప్రకటించారు.

తాజాగా, మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేసినట్లు సమాచారం . దీనితో ఇప్పటి వరకు రాజీనామా చేసిన మంత్రుల జాబితా 5 కు చేరింది. ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson's) ఇటీవల అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. కరోనా సమయంలో పార్టీ గేట్ వివాదం, ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్ క్రిస్ పించర్ వివాదం, బోరిస్ కు తీవ్ర తలవంపులు తెచ్చిపెట్టాయి. దీన్ని ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు.



ఇదిలా ఉండగా బ్రిటన్ లో (Britan)  కీలక పరిణామాం సంభవించింది.

ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తు.. బ్రిటన్ ఆర్థిక మంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టి బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్, ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ మంగళవారం రాజీనామా చేశారు. బ్రిటన్ లో ఈ మధ్య కాలంలో అనేక రకాల అవినీతి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యలో దేశం ప్రయోజనం కోసం.. బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు.

ఇక ఈయన మార్గంలోనే.. హెల్త్ సెక్రటరీ సాజిద్ జావిద్ (Sajeed jawed) కూడా రిజైన్ చేశారు. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ నాయకత్వాన్ని వీరు తీవ్రంగా ఎండగట్టారు. కోవిడ్ సమయంలో పార్టీ గేట్ లో పాల్గొని వివాదస్పదం అయినందుకు.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆర్థిక మంత్రికి రిషి సునక్ లకు జరిమాన విధించిన విషయం తెలిసిందే. అదే విధంగా, స్లీజ్ కుంభకోణం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వరుస కుంభకోణాల పరంపర నేపథ్యంలో.. జాన్సన్ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిపాలించగలరనే సామర్థ్యంపై తనకు నమ్మకం పోయిందని జావిద్ అన్నారు. ఇకపై తన మనస్సాక్షిని చంపుకుని ఇక్కడ పనిచేయలేనని చెప్పాడు. అంతే కాకుండా.. బోరిస్ జాన్సన్ నాయకత్వంలో ఈ పరిస్థితి మారదనే విషయం, స్పష్టంగా అర్థమైందని చెప్పడానికి నేను చింతిస్తున్నట్లు మిస్టర్ జావిద్, బోరిస్ జాన్సన్ కు రాసిన లేఖలో తెలిపారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Britan, Politics

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు