Cars: నిబంధనలు అతిక్రమించినందుకు... ఫెరారీ, లంబోర్ఘిని సహా కార్లన్నీ రోడ్డుపైనే నిలిపివేత

ప్రతీకాత్మక చిత్రం

Viral: రేసింగ్ ఇష్టపడేవాళ్లకైతే వాటిని చూస్తే కాళ్లు, చేతులు ఆగవు. ఎప్పుడెప్పుడు వాటిని డ్రైవ్ చేస్తామా..? అని ఆత్రుతతో ఉంటారు. హాంకాంగ్ లో పలువురు ఖరీదైన కార్ల ఓనర్లు అలాగే చేశారు. కానీ నిబంధనలు అతిక్రమించారని అడ్డంగా బుక్కయ్యారు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 45 కార్లు.

 • News18
 • Last Updated :
 • Share this:
  అవన్నీ అత్యంత ఖరీదైన కార్లు. వాటిని చూస్తే జీవితంలో ఒక్కసారైనా ఈ బళ్లల్లో ఎక్కి.. షికారు చేయకుంటే మన జన్మ వ్యర్థమేమో..! అన్నంత విలాసవంతమైన కార్లు. ఇక రేసింగ్ ఇష్టపడేవాళ్లకైతే వాటిని చూస్తే కాళ్లు, చేతులు ఆగవు. ఎప్పుడెప్పుడు వాటిని డ్రైవ్ చేస్తామా..? అని ఆత్రుతతో ఉంటారు. హాంకాంగ్ లో పలువురు ఖరీదైన కార్ల ఓనర్లు అలాగే చేశారు. కానీ నిబంధనలు అతిక్రమించారని అడ్డంగా బుక్కయ్యారు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 45 కార్లు.

  హాంకాంగ్ లో జరిగింది ఈ ఘటన. ఈ నెల 21 న హాంకాంగ్ లోని ఐలాండ్ ఈస్టర్న్ కారిడార్ ఎక్స్ప్రెస్ వే పై చోటు చేసుకుంది. మీడియా కథనాలు ఇలాఉన్నాయి. ఈనెల 21 న ఫెరారీ, లంబోర్ఘిని వంటి సూపర్ రేసింగ్ కార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాటన్నింటినీ రోడ్డు మీద వరుసలా ఉంచారు పోలీసులు. నిబంధనలు అతిక్రమించినందుకు గానూ వీటిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.  ఈ కార్ ఓనర్లంతా ఈస్టర్న్ కారిడాన్ ఎక్స్ప్రెస్ వే వెంట రేసింగ్ నిర్వహించారని పోలీసులు తెలిపారు. అయితే ఈ రోడ్డు మీద వేగం గంటకు 70 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఆ దారిమీద నిబంధనలను విస్మరించి రేసింగ్ నిర్వహించినందుకు గానూ వారిమీద జరిమానా విధించడమే గాక ఆ కార్లన్నింటినీ రోడ్డు మీద వరుసగా పేర్చారు పోలీసులు.

  ఈ హైవే మీద రేసింగ్ లు నిర్వహించకూడదని పోలీసులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో పాటు ఆ హైవే చుట్టు పక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా అధికారులకు పదే పదే విన్నవించడంతో అధికారులు పై విధంగా చర్యలు తీసుకున్నారు.
  Published by:Srinivas Munigala
  First published: