చైనా(China)లో ఊహించని విధంగా అగ్నిప్రమాదం జరిగింది. హునాన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్సా(Changsha)లో భారీ ఎత్తునై భవనం మంటల్లో చిక్కుకుంది. అగ్నిప్రమాదం సంభవించిన భారీ అంతస్తుల భవనం టెలికాం సంస్థ(Telecom company)కు చెందినది కావడంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. ఈ బహుళ అంతస్తు బిల్డింగ్ నుంచి అగ్నికీలలు ఎగసిపడటంతో వందలాది మంది ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు గంటల తరబడి శ్రమించారు. 42అంతస్తుల (42Storey)ఈభవనం ఎత్తు218మీటర్లు ఉండటంతో మంటల్ని కంట్రోల్ చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఓవైపు అగ్నికీలలు ఎగపడుతూ ..మరోవైపు టవర్ మొత్తం కాలిపోతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
పేక మేడలా కలిపోతున్న భవనం..
చైనాలో ఏ ప్రమాదం జరిగిన అది ప్రపంచ దేశాలను ఆకర్షించే స్థాయిలో జరుగుతుంది. తాజాగా చాంగ్సాలోని టెలికాం భవనంలో సంభవించిన ఫైర్ యాక్సిడెంట్ కూడా అలాంటిదే. 42అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో నిమిషాల వ్యవధిలోనే చాలా ఫ్లోర్లకు వ్యాపించాయి. దీంతో లోపలున్న వాళ్లు భయాందోళనకు గురైనప్పటికి సుమారు 300మంది ఫైర్ సిబ్బంది స్పాట్‌కి చేరుకున్నారు. పదుల సంఖ్యలో ఫైరింజన్ల సాయంతో మంటల్ని ఆర్పేందుకు శతివిధాలుగా ప్రయత్నిస్తున్నారు. భారత కాలమాన ప్రకారం ఫైర్ యాక్సిడెంట్ శుక్రవారం మధ్యాహ్నం జరిగింది.
42అంతస్తులకు వ్యాపించిన మంటలు.
.
ఎగసిపడుతున్న మంటలు ఓవైపు ..ఆకాశాన్ని కమ్మేసే విధంగా కమ్మేస్తున్న పొగ మరోవైపు వ్యాపిస్తుండటంతో లోపలున్న వాళ్లంతా ఆందోళనకు గురయ్యారు. అయితే ఈప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరూ అగ్నిప్రమాదం చిక్కుకోలేదని టెలికాం సంస్థ అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి కారణం ఏమిటనే విషయం మాత్రం తెలియరాలేదు. మంటల తీవ్రతకు 42అంతస్తుల భవనంలో చాలా ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి.
తప్పిన ప్రాణనష్టం..
ఈ భయంకరమైన అగ్నిప్రమాదం కారణంగా ప్రాణనష్టమే కాదు సెల్‌ఫోన్ సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని టెలికాం సంస్థ నిర్వహకులు చెబుతుంటే మొబైల్ యూజర్లు మాత్రం సర్వీసులు పనిచేయలేదని తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భవనం నుంచి దట్టంగా ఎగసిపడుతున్న పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేయడం, భవనం నుంచి శిథిలాలు కిందపడుతుండడం కొన్ని వీడియోల్లో ఉంటే.. భవనంలో చిక్కుకుపోయిన వర్కర్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మరికొన్ని వీడియోల్లో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Trending news, Viral Video