4 YEAR OLD GIRL IN RAJASTHAN CLAIMS REINCARNATION PVN
Shocking Case : గత జన్మ గురించి చెబుతున్న 4ఏళ్ల బాలిక..రాజస్తాన్ లో బుల్లి జేజమ్మ
ఇప్పుడిలా,గత జన్మలో అలా ఉంది
Rajastan Girl : మరణించిన వాళ్లు మళ్లీ పుడతారా?పునర్జన్మలు అసలు ఉంటాయా?తీరని కోరికతో చనిపోయినవారికి గత జన్మ జ్షాపకాలు గుర్తుకొస్తాయా? ఇలాంటి టాపిక్ లు ఎప్పుడూ ఆశక్తికరంగానే ఉంటాయి. తాజాగా
Rajasthan Girl : అసలు మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు?మరణించిన వాళ్లు మళ్లీ పుడతారా?పునర్జన్మలు అసలు ఉంటాయా?తీరని కోరికతో చనిపోయినవారికి గత జన్మ జ్షాపకాలు గుర్తుకొస్తాయా? ఇలాంటి టాపిక్ లు ఎప్పుడూ ఆశక్తికరంగానే ఉంటాయి. దీనికి సంబంధించి పలు మత గ్రంథాల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నాస్తికులు,ఆస్తికులు దీని గురించి ఒక్కో రకంగా నమ్ముతారు. కొందరు సైన్స్ లో ఇలాంటివాటికి చోటు లేదని చెబితే..మరికొందరు మాత్రం ఇవి ముమ్మాటికి జరుగుతాయని గట్టిగా నమ్ముతారు. ఈ కంప్యూటర్ కాలంలోనూ మన విజ్ణానానికి అందని మిస్టరీలు మిస్టరీలుగానే మిగిలిపోయాయ్. పునర్జన్మల నమ్మకాలను బలపర్చేలా కొన్ని ఘటనలు జరిగాయ్. తమకు పునర్జన్మ గుర్తొచ్చిందని చెప్పినవాళ్లు చాలామంది ఉన్నారు. దానికి తగిన రుజువులు,సాక్ష్యాలు చూపించి అందరినీ ఆశ్చర్యపర్యారు కూడా. తాజాగా రాజస్తాన్ రాష్ట్రంలో ఈ పునర్జన్మ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. గత జన్మ తాలూకు గుర్తులు చెబుతూ ఓ బాలిక రాజస్తాన్ లో సంచలనం సృష్టిస్తోంది.
రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌కు సమీపంలోని పరావాల్ గ్రామానికి చెందిన రతన్ సింగ్‌కు ఐదుగురు కూతుళ్లు. వీరిలో నాలుగవ కుమార్తె కింజల్(4)ఏడాది క్రితం నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తోంది. తన సోదరుడు ఎక్కడ అని తల్లిదండ్రులను ప్రశ్నించడం మొదలుపెట్టింది. అయితే కింజల్ కు అసలు సోదరుడే లేరు. . తన పేరు ఉష అని, తనది రాజ్‌సమంద్ జిల్లాలోని పిప్లాంత్రి గ్రామమని, 2013లో తాను వంట గదిలో పనిచేస్తున్న సమయంలో అగ్నిప్రమాదం జరిగి కాలిన గాయాలతో మరణించానని కుటుంబ సభ్యులకు కింజల్ చెప్పింది. కింజల్ చెబుతున్న పిప్లాంత్రి గ్రామం, ఆమె ప్రస్తుతం ఉంటున్న ఊరికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మొదట్లో కింజల్ మాటలను ఎవరూ పట్టించుకోలేదు. కింజల్ చెప్పే మాటలను కుటుంబ సభ్యులు పరిగణనలోకి తీసుకోలేదు. కింజల్ మాటలు విని ఆమె తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థంకాలేదు. కింజల్ కు ఏదో మానసిక సమస్య ఉందేమోనని భావించి డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లగా..కింజల్ కు ఎలాంటి మానసిక సమస్యలు లేవు అని డాక్టర్లు తేల్చారు.
ఈ విషయం కాస్తా 2013లో పిప్లాంత్రి గ్రామంలో గ్ని ప్రమాదంలో చనిపోయిన ఉష అనే యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. మృతురాలు ఉష సోదరుడు పంకజ్ పరవాల్ గ్రామానికి చేరుకున్నాడు. పంకజ్‌ని చూసిన వెంటనే కింజల్‌కు ఆనందం వచ్చిందని అంటున్నారు జనాలు. పంకజ్ తన తల్లిదండ్రుల ఫోటోను చూపించినప్పుడు, కింజల్ గుర్తుపట్టి.. ఆపై ఏడుపు ప్రారంభించింది. తన కుటంబసభ్యులను గుర్తు పట్టడమే కాదు.. చిన్న నాటి సంఘటనలను కూడా యథాతథంగా చెప్పింది. షాకైన పంకజ్ జనవరి 14న కింజల్‌ను తన గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ ఉష తల్లి దుర్గాదేవిని చూసి కింజల్ భోరును విలపించింది. గ్రామంలోని తన స్నేహితులను పలకరించింది. గత జన్మలో తనకు ఇష్టమైన వస్తువుల గురించి మాట్లాడింది. దీంతో అందరూ షాకయ్యారు. పిప్లాంతి గ్రామస్థులతో తనకున్న అనుబంధాన్ని కింజల్ గుర్తు చేసుకుంది.
కింజల్ మాటలు, ప్రవర్తన చూస్తుంటే తమ కూతురినే చూస్తున్నట్టు ఉందని ఉష తల్లి చెబుతున్నారు. ప్రస్తుతం కింజల్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటూ ఉష తల్లిదండ్రులను కూడా తరచుగా కలుస్తోంది. రోజూ ఫోన్లో మాట్లాడుతోంది. ఇరు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.
కాగా, ఇటీవల నాని హీరోగా నటించిన `శ్యామ్ సింగరాయ్` కూడా ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. గత జన్మలో `శ్యామ్ సింగరాయ్`గా గడిపిన జీవితం తర్వాతి జన్మలో కూడా హీరోకి గుర్తుకు వస్తుంటుంది. అచ్చం అలాగే కింజల్ కూడా తన గత జన్మ గురించి మాట్లాడుతుండటంపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దీంతో బాలికకు మరో జన్మ ఎలా వచ్చిందని ప్రశ్నలు వస్తున్నాయి.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.