40 నిమిషాల్లోనే కాలినడకన తిరుమల కొండపైకి.. నాలుగేళ్ల బుడతడి సంచలనం..

ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరుకు చెందిన ఎస్.తోనేశ్వర్ సత్య అనే బాలుడు తన పుట్టిన రోజు ఆగస్టు 13న ఈ ఫీట్ సాధించాడు. మూడున్నరేళ్ల వయసు నుంచే సత్య తిరుమల మెట్ల మార్గం ఎక్కడం మొదలుపెట్టాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 21, 2019, 11:03 AM IST
40 నిమిషాల్లోనే కాలినడకన తిరుమల కొండపైకి.. నాలుగేళ్ల బుడతడి సంచలనం..
తిరుమల కొండ ఎక్కుతున్న సత్య
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 21, 2019, 11:03 AM IST
తిరుమల కొండ కింది నుంచి పై వరకు.. నడుస్తూ ఏడు కొండలు దాటుకుంటూ వెళ్లాలంటే కనీసం నాలుగు గంటలు పడుతుంది. ఆరోగ్యంగా ఉన్న యువకులకైతే కనీసంలో కనీసం రెండు గంటలు పడుతుంది. కానీ, ఓ నాలుగేళ్ల బాలుడు సంచలనం సృష్టించాడు. కేవలం 40 నిమిషాల్లోనే కింది నుంచి పై వరకు నడిచి వహ్వా! అనిపించాడు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరుకు చెందిన ఎస్.తోనేశ్వర్ సత్య అనే బాలుడు తన పుట్టిన రోజు ఆగస్టు 13న ఈ ఫీట్ సాధించాడు. మూడున్నరేళ్ల వయసు నుంచే సత్య తిరుమల మెట్ల మార్గం ఎక్కడం మొదలుపెట్టాడు. తొలిసారి తన తండ్రి సాయిబాబుతో వచ్చినప్పుడు ఎత్తుకుంటామన్నా వినకుండా దిగి మెట్లు ఎక్కాడు.

తల్లిదండ్రులు దేవుడి దయ అంటూ అప్పటి నుంచి ప్రతి నెలా తీసుకురావడం మొదలుపెట్టారు. తొలిసారి రెండు గంటల 20 నిమిషాల్లో కొండ ఎక్కిన సత్య, అప్పటినుంచి వరుసగా సమయం తగ్గించుకుంటూ వచ్చి, ఈసారి కేవలం 40 నిమిషాల 20 సెకన్లలోనే ఏడు కొండలు ఎక్కేశాడు.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...