Home /News /trending /

4 FEET LONG INDIAN ROCK PYTHON FOUND INSIDE CARS BONNET IN AGRA SRD

Python : కారు ఇంజిన్ లో అనుకోని అతిథి..దాన్ని చూసి షాక్ తిన్న యజమాని ఏం చేశాడంటే..

Python Found Inside Car (Photo : Twitter)

Python Found Inside Car (Photo : Twitter)

Python : ఆగ్రాలోని ఎల్ ఐ సీ కాలనీలో నివసిస్తున్న ఓ కుటుంబానికి వింత అనుభవం ఎదురైంది. కారు బొనెట్ ను తెరిచి చూసిన ఆ యజమాని ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.

    ఆగ్రాలోని ఎల్ ఐ సీ కాలనీలో నివసిస్తున్న ఓ కుటుంబానికి వింత అనుభవం ఎదురైంది. కారు బొనెట్ ను తెరిచి చూసిన ఆ యజమాని ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. కారు ఇంజిన్‌ భాగంలోకి నాలుగు అడుగుల కొండచిలువ దూరింది. దీనిని గుర్తించిన ఆ కారు ఓనర్‌ కు ఒక్కసారిగా ఏం చేయాలో పాలుపోలేదు. ఇంజిన్‌ పైభాగంలో నాలుగు అడుగుల ఇండియన్ రాక్ ఫైథాన్ చుట్టుకొని ఉండటాన్ని చూసిన భయాందోళన చెందాడు. వెంటనే వన్యప్రాణుల సంరక్షణ విభాగానికి ఫోన్‌ చేయగా వారు స్పందించారు. ఆ శాఖకు చెందిన సిబ్బంది ఆ కొండచిలువను చాకచక్యంగా పట్టుకుని అనంతరం అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

    "సమాచారం అందుకోగానే మేం అలర్ట్ అయ్యాం. అతి జాగ్రత్తగా రెస్కూ ఆపరేషన్ నిర్వహించి కొండచిలువను బయటికి తీశాం.చలి కాలంలో ఇలాంటివి జరగడం సాధారణం " అని వన్యప్రాణుల సంరక్షణ అధికారి తెలిపాడు.


    " ఉష్ణోగ్రతలు పడిపోగానే ఇలాంటివి జరగడం సాధారణం. చలికాలంలో వేడి ప్రదేశాల కోసం పాములు చూస్తుంటాయ్. అందుకే అర్బన్ ఏరియాల్లో ఇలాంటి ఘటనలు కామన్ గా జరుగుతున్నాయ్. ఇలాంటి సున్నితమైన ఆపరేషన్ చేసేటప్పుడు నిపుణులైన వారు అవసరం" అని వైల్డ్ లైఫ్ అధికారి తెలిపారు. ఇండియన్ రాక్ ఫైథాన్ విషపూరితమైనది కాదు. సాధారణంగా అడువుల్లో నివసించే ఈ జాతి కొండచిలువ చిన్న చిన్న పక్షులు, జింకల్ని తింటుంది. ఇవి ఎక్కువగా మన దేశంతో పాటు పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో ఎక్కువగా కన్పిస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Agra, CAR, Python

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు