మన దేశంలో ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలను అఖిల భారత సర్వీసు ఉద్యోగాలుగా భావిస్తారు. ఎంతో మంది యువత.. ఐఏఎస్ అవ్వాలని కలలు కంటుంటారు. దానికోసం తమ జీవితంలోని అత్యంత అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తుంటారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు పుస్తకాల పురుగుగా చదువుతు ఉంటారు. అయితే, ఎంతో కష్టపడితే కానీ అఖిల భారత సర్వీసులో ర్యాంకు కొట్టలేము. అయితే, ఇక్కడోక అధికారి తాను.. చిన్న తనంలో కేవలం యావరేజ్ విద్యార్థి అని.. కానీ ఆ తర్వాత.. కష్టపడి చదివి కలెక్టర్ అయ్యానని చెప్పి విద్యార్థులలో స్పూర్తిని నింపారు. అదే విధంగా తన టెన్త్ క్లాస్ లో సాధించిన మార్కుల మోమోను, మరోక ఐఏఎస్ అధికారి తన ట్వీటర్ లో పోస్ట్ చేశారు. (Marksheet of An IAS Officer) ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా (viral news) మారింది.
పూర్తి వివరాలు.. గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని భరూచ్ జిల్లా కలెక్టర్ తుషార్ సుమేర్ ప్రస్తుతం వార్తలలో నిలిచారు. ఆయన స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. అక్కడ.. టెన్త్ పూర్తి చేసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. తాను కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివానని అన్నారు. మీలాగే తాను కూడా ..యావరేజ్ స్టూడెంట్ అని అన్నారు.
भरूच के कलेक्टर तुषार सुमेरा ने अपनी दसवीं की मार्कशीट शेयर करते हुए लिखा है कि उन्हें दसवीं में सिर्फ पासिंग मार्क्स आए थे.
उनके 100 में अंग्रेजी में 35, गणित में 36 और विज्ञान में 38 नंबर आए थे. ना सिर्फ पूरे गांव में बल्कि उस स्कूल में यह कहा गया कि यह कुछ नहीं कर सकते. pic.twitter.com/uzjKtcU02I
— Awanish Sharan (@AwanishSharan) June 11, 2022
అదే విధంగా, టెన్త్ లో సాధించిన మార్కులను కూడా విద్యార్థులతో పంచుకున్నారు. తనకు టెన్త్ లో 36 వచ్చాయని, సైన్స్ లో 38 వచ్చాయని అన్నారు. మార్కులతో ఎలాంటి సంబంధం ఉండదని, మనం కష్టపడి చదివితే, ఏదైన సాధించవచ్చని విద్యార్థులలో ధైర్యాన్ని నింపారు.
ఛత్తీస్ గఢ్ కలెక్టర్ అవనీష్ శరణ్ తన ఇన్ స్టాలో, భరుచా కలెక్టర్ పదవ తరగదిలో సాధించిన మార్కుల జాబితాను పోస్ట్ చేశారు. దీనికి, తుషార్ సుమేర్ ధన్యవాదాలు తెలిపారు. మనం ఒక సంకల్పం చేసుకుని దాని కోసం కష్టపడితే అది ఖచ్చితంగా అవుతుందని తుషార్ సుమేర్ విద్యార్థులలో ఉత్సాహన్నినింపారు. ప్రస్తుతం కలెక్టర్ మార్క్స్ లిస్ట్ సోషల్ మీడియాలో(Social media) వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat, Students, Tenth class, VIRAL NEWS