హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

యాభై ఏళ్లు దాటిన వారితోనే ఎఫైర్.. తన కోరిక తీరిస్తేనే పెళ్లి.. అసలు ట్విస్ట్ ఏంటంటే..

యాభై ఏళ్లు దాటిన వారితోనే ఎఫైర్.. తన కోరిక తీరిస్తేనే పెళ్లి.. అసలు ట్విస్ట్ ఏంటంటే..

డామియా జేమ్స్ (ఫైల్)

డామియా జేమ్స్ (ఫైల్)

Viral news: యువతి సోషల్ మీడియాలో అనేక మంది యువకులతో డేటింగ్ చేసి విసిగిపోయింది. చివరకు ఒక నిర్ణయానికి వచ్చింది. పెళ్లి కూడా చేసుకుంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India

మనలో చాలా మంది ప్రేమ పెళ్లిళ్లు (Wedding) చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. ప్రేమలో ఇద్దరు ముందు స్నేహంగా ఉంటారు. ఆ తర్వాత.. తమ ఇష్టాయిష్టాలు పంచుకుని, ఒకరిని మరోకరు అర్థం చేసుకుని నచ్చితే.. పెళ్లికి ప్రొసీడ్ అవుతుంటారు. ఒకవేళ నచ్చకపోతే.. మధ్యలోనే బ్రేకప్ అయిపోతుంటారు. అయితే.. కొందరు ప్రేమను (Love affair) తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. అవతలివారిని ప్రేమిస్తున్నామంటూ మాయమాటలు చెబుతున్నారు. ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. డబ్బులు, హోదా ఉన్నవారిని చూసుకొని వారితో ప్రేమాయణం నడిపిస్తున్నారు. ప్రేమ ముసుగులో అడ్డమైన వేషాలు వేస్తున్నారు. కొందరు అవసరం కోసం ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. మరికొందరు భవిష్యత్తులో తాము.. లగ్జరీ లైఫ్, కాస్లీ జీవితం అందించే వాడిని చూసీ మరీ పెళ్లి చేసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. యూఎస్ లో (United states) వింత ఘటన చోటు చేసుకుంది. జార్జీయాలోని అట్లాంటాలో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది. అట్లాంటాకు చెందిన డామియా విలియమ్స్ అనే యువతి సోషల్ మీడియాలో అనేకమంది యువకులతో డేటింగ్ చేసి విసిగిపోయింది. చివరకు ఆమె ఒక  నిర్ణయానికి వచ్చింది. తాను పెళ్లంటూ చేసుకుంటే.. 50 ఏళ్లు పైబడిన వారినే చేసుకుంటానని నిర్ణయించుకుంది. అంతేకాకుండా.. తన జీవితంలో అవసరాలు తీర్చేవారిని, జీవితంలో మంచిగా సెటిల్ అయిన వారిని పెళ్లిచేసుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో ఆమెకు.. డామియా జేమ్స్ అనే 67 ఏళ్ల వ్యక్తితో 2017 లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ఇద్దరు తరచుగా కలుసుకునే వారు. షాపింగ్ లు, షికార్లు ఎక్కడికి వెళ్లిన ఇద్దరు కలిసే వెళ్లేవారు. ఈ క్రమంలో... వీరి మనస్సులు ఒకటి కావడంతో 2018లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత.. పెళ్లి కూడా చేసుకున్నారు. 2019లో, జేమ్స్ ఆమెకు స్వంతంగా నివసించేందుకు ఇంటిని  కొనుగోలు చేశాడు. అంతే కాకుండా ఒక కారును కూడా ఆమె తిరగటానికి కొనిచ్చాడు. పెళ్లిపై తన ఒపినియన్ ను.. డామియా సోషల్ మీడియాలో పంచుకుంది. ‘తాము ఎంతో ఆనందంగా ఉన్నామని, తమ వయసులో గ్యాప్ ఎక్కువగా ఉన్న ఇద్దరం ఎంతో ఆనందంగా ఉన్నామని  చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీరి పెళ్లి న్యూస్ (Wedding news)  కాస్త సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Love affair, United states, VIRAL NEWS, Wedding

ఉత్తమ కథలు