చరిత్రలో షార్క్ దాడిలో చనిపోయిన తొలి వేటగాడి అస్థిపంజరాన్ని గుర్తించారు పరిశోధకులు. మూడువేళ్ల ఏళ్ల క్రితం నాటి ఓ వేటగాడి శరీరంపై చేసిన పరిశోధనల్లో ఈ ఆసక్తికర విషయం బయటికొచ్చింది. అతడి ఎముకల గూడు/అస్థికలను పరిశోధించిన తర్వాత శాస్త్రవేత్తలు దీన్ని నిర్ధారించారు. ఆక్స్‌ఫర్ట్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలను ఆర్కియోలాజికల్ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ బృందంలో అలీసా వైట్, ప్రొఫెసర్ రిక్ స్కల్టింగ్ పాల్గొన్నారు. షార్క్ దాడిలో వేటగాడికి 790 గాయాలు ఉన్నట్లు వారు తెలిపారు. స్కెలిటన్‌కు ఇన్ని గాయాలు ఉండటం చూసి తొలుత పరిశోధకులు ఆశ్చర్యపోయారట. అందులో ఎక్కువగా శాతం కాళ్లు, చేతులు, ఛాతిపైనే ఉన్నాయట. ఇలాంటి కేసులు చాలా తక్కువగా నమోదైన కారణంగా... ఈ ఇద్దరు నిపుణులు మరికొంతమంది పరిశోధకులతో టైఅప్ అయ్యి పరిశోధనలు నిర్వహించారు. వీలైనంతవరకు దాడిని రీకన్‌స్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆ స్కెలిటన్ మూడు వేల ఏళ్ల క్రితం నాటిదని గుర్తించారు. సుమారు క్రీస్తు పూర్వం 1370 నుంచి 1010 మధ్య కాలానికి చెందిన అస్థిపంజరంగా శాస్త్రవేత్తలు గుర్తించారు.
స్కెలిటన్ మీద ఉన్న గాయాల సరళిని చూస్తుంటే... బతికుండగానే ఆ వ్యక్తిపై దాడి జరిగినట్లు తేల్చారు. దాడికి గురైన వెంటనే డెడ్‌బాడీని తీసుకొని పాతిపెట్టినట్లుగా పరిశోధకులు తేల్చారు. దాంతోపాటు ఆ శరీరానికి చెందిన కుడికాలు లేదట. అలాగే ఎడమకాలు కూడా వేరుపడి ఉందట. దాన్ని బాధితుడి శరీరం మీద ఉంచి పాతిపెట్టారని పరిశోధనలో తేలిందట.
ఈ మొత్తం వివరాలు, పరిశోధన తర్వాత... ఆ వ్యక్తి మరణించింది షార్క్ దాడితోనేనని గుర్తించారు. చరిత్రలో షార్క్ దాడిలో మరణించిన తొలి వ్యక్తిగా గుర్తించారు. ఈ వ్యక్తి చేపల వేటకు వెళ్లే క్రమంలో అతనితో ఇంకొంతమంది ఉన్నారని, అందుకే దాడి జరిగిన వెంటనే అతని డెడ్‌బాడీని పాతిపెట్టగలిగారని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు స్కెలిటన్‌పై ఉన్న పంటిగాట్లను బట్టి చూస్తే... ఆ షార్క్ టైగర్‌కానీ, వైట్ షార్క్ కానీ అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఒక్కసారి ఊహించుకోండి... ఒకవ్యక్తిపై 790 షార్క్ చేసిన గాయాలు ఉన్నాయంటే... ఆ వ్యక్తి ఎంతగా నరకయాతన అనుభవించి ఉంటాడో.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending, VIRAL NEWS