Boy Swallows Ganesha Idol: వినాయకుడు విగ్రహాన్ని మింగేసిన చిన్నారి... ఆ తర్వాత ఏమైందంటే?

ప్రతీకాత్మకచిత్రం

బసవ చాలా చలాకీ కుర్రాడు. మూడేళ్ల వయసు ఉంటుంది... అల్లరి మాత్రం మామూలుగా ఉండదు. అలా ఇంట్లో వస్తువులను తనదైన శైలిలో సర్దేస్తుంటాడు. అద

  • Share this:
బసవ చాలా చలాకీ కుర్రాడు. మూడేళ్ల వయసు ఉంటుంది... అల్లరి మాత్రం మామూలుగా ఉండదు. అలా ఇంట్లో వస్తువులను తనదైన శైలిలో సర్దేస్తుంటాడు. అదేనండి మన ఇళ్లలో పిల్లలు ఉంచిన వస్తువు ఉంచిన దగ్గర ఉంచరో అలా అన్నమాట. అల్లరి బసవ ఇటీవల కడుపు నొప్పి అంటూ బాధపడ్డాడు. ఏమైందో అర్థం కాని కుటుంబ సభ్యులు వెంటనే కుర్రాడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీరా అక్కడ ఎక్స్‌రే తీస్తే పొట్టలో వినాయకుడు కనిపించాడు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఈ వార్త పూర్తిగా చదివేయండి.

బసవ కర్ణాటకలోని బెంగళూరులో ఉంటాడు. ఇటీవల ఆడుకుంటూ... ఇంట్లో ఉన్న చిన్న వినాయకుడి విగ్రహంతోఆడుకుంటూనోట్లో పెట్టేసుకున్నాడు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని మింగేశాడు. కాసేపటికి పిల్లాడు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. దీన్ని గుర్తించినబసవ తల్లిదండ్రులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ఛాతి పై భాగంతో నొప్పి వస్తోందని గుర్తించిన వైద్యులు వెంటనే ఎక్స్‌రే తీశారు. అందులో చూస్తే ఐదు సెంటీమీటర్లున్న ఓ చిన్న వినాయకుడి విగ్రహం ఛాతిలో ఇరుక్కుని ఉండటం గమనించారు. దీంతో పిల్లాడు ఉమ్మిని మింగడానికి సైతం ఇబ్బంది పడుతున్నాడని వైద్యులు గుర్తించారు.

విగ్రహాన్ని బయటకు తీయడానికి వైద్యులు పూనుకున్నారు. దీని కోసం ఫ్లెక్సిబుల్‌ ఎండోస్కోపీ విధానాన్ని ఎంచుకున్నారు. పిల్లాడికి ఎనస్థీసియా ఇచ్చి... గంటపాటు వైద్యులు శ్రమించి పొట్ట నుండి విగ్రహం బయటకు తీశారు. అక్కడికి మూడు గంటల తర్వాత బసవ ఎంచక్కా భోజనం చేశాడట. దీంతో పిల్లాడిని డిశ్చార్జి చేశారట. విగ్రహం పిల్లాడి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగేదని, అయితే కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తీసుకొచ్చారని వైద్యులు చెప్పారు. తమ అనస్థీసియా బృందం, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ బృందం వేగంగా స్పందించి అవసరమైన ప్రక్రియ చేపట్టి పిల్లాడి పొట్ట నుండి విగ్రహం తీశామనివైద్యులు చెప్పారు.

పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ఆడుకుంటున్నారు కదా అని వదిలేయకుండా ఓ కన్నేసి ఉంచాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. గతంలోనూ పిల్లలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలు చాలా ఉన్నాయి. ఏవైనా మింగేసినప్పుడు ఊపిరి ఆడక ఇబ్బందుపడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయని గుర్తు చేస్ఉతన్నారు. అయితే బసవ విషయంలో వైద్యులు చాలా చక్కగా స్పందించి విగ్రహాన్ని బయటకు తీసేశారు. దీంతో అందరూ వైద్యుల్ని అభినందిస్తున్నారు.
Published by:Krishna Adithya
First published: