Home /News /trending /

26 YEARS OLD AZEEM MANSURI SEEKS CHIEF MINISTER YOGI ADITYANATH AND UP POLICE HELP TO FIND BRIDE FOR HIS MARRIAGE HSN

నాకు పిల్లను వెతికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో.. అంటూ ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసిన 26 ఏళ్ల కుర్రాడు

Azeem Mansuri (Image Credit: Twitter)

Azeem Mansuri (Image Credit: Twitter)

ఆ కుర్రాడికి పెళ్లి చూపుల పట్ల విసుగొచ్చింది. తనకు పెళ్లి చేయాలంటూ ఏకంగా సీఎం లేఖను రాశాడు. తాజాగా తనకు పెళ్లి చేయండంటూ పోలీసులను విన్నవించుకుంటున్నాడు. పబ్లిక్ సర్వీస్ లో భాగంగా తనకు ఈ ఒక్కసాయం చేసి పుణ్యం కట్టుకోండి ప్లీజ్ అంటూ కోరుతున్నాడు.

ఇంకా చదవండి ...
  ఒకటి కాదు రెండు కాదు ఐదేళ్లుగా అతడికి పెళ్లి చూపులు చూస్తూనే ఉన్నారు. కానీ ఎన్ని సంబంధాలు చూసినా ఆ కుర్రాడికి పెళ్లి సెట్ అవడం లేదు. అమ్మాయి తరపు వాళ్లు అతడిని చూసేందుకు ఇంటికి రావడం, అబ్బాయిని చూడటం, మాట్లాడటం జరుగుతూనే ఉన్నాయి. ఫోన్ చేసి చెబుతాం అంటూ వెళ్లే వాళ్ల వద్ద నుంచి ఎలాంటి స్పందన ఉండటం లేదు. చివరకు ఆ కుర్రాడికి పెళ్లి చూపుల పట్ల విసుగొచ్చింది. తనకు పెళ్లి చేయాలంటూ ఏకంగా సీఎంకు కూడా లేఖను రాశాడు. తాజాగా తనకు పెళ్లి చేయండంటూ పోలీసులను విన్నవించుకుంటున్నాడు. పబ్లిక్ సర్వీస్ లో భాగంగా తనకు ఈ ఒక్కసాయం చేసి పుణ్యం కట్టుకోండి ప్లీజ్ అంటూ కోరుతున్నాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఓ కుర్రాడు పెళ్లి విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  అజీమ్ అనే కుర్రాడికి 26 ఏళ్ల వయసు. కాస్మోటిక్స్ వ్యాపారం చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. డబ్బును కూడా బాగానే కూడబెట్టుకన్నాడు. సొంత ఇల్లు కూడా ఉంది. బంధువులు, బలగం కూడా బాగానే ఉన్నారు. అతడికి 21 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులు పెళ్లి చూపులు మొదలు పెట్టారు. కానీ ఐదేళ్లయినా అతడికి ఎంతకూ పెళ్లి కుదరడం లేదు. కారణం, అతడు రెండంటే రెండే అడుగులు ఉండటమే. అవును అతడు మరుగుజ్జు. మీరు కమల్ హసన్ హీరోగా నటించిన విచిత్ర సోదరులు సినిమాను చూసే ఉంటారు. అందులో ఓ సన్నివేశంలో కమల్ హసన్ కు తల్లిగా నటించిన ఆమె ‘ఒక వేళ మీ అమ్మాయి నా కొడుకు లాంటి వాడిని ప్రేమిస్తే మీరు అభ్యంతరం పెట్టాలి. మీ అమ్మాయి ప్రేమించిన కుర్రాడు చక్కగా ఒడ్డూ పొడుగు బాగున్నాడు. అమ్మాయికి సరైన ఈడుజోడు. మీ అమ్మాయి ప్రేమ పెళ్లికి ఒప్పుకోండి‘ అంటూ ఓ మాట అంటుంది. దాంతో మరుగుజ్జు కమల్ హాసన్ తీవ్రంగా మనో వేధనకు గురవుతాడు.
  ఇది కూడా చదవండి: నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి.. ఇంట్లోనే భర్తను పూడ్చిపెట్టిన చోట రోజూ నీళ్లు చల్లిన భార్య.. చంపి మంచి పనే చేశానంటూ కామెంట్స్

  అచ్చం అదే మనోవేధన పెళ్లిచూపులు జరిగిన ప్రతీసారి అజీమ్ ఎదుర్కొంటున్నాడు. చిన్నప్పుడు స్నేహితుల కామెంట్స్ భరించలేక ఐదో తరగతి వరకే చదువును ఆపేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కో పని చేసుకుంటూ కాస్మొటిక్స్ వ్యాపారం చేస్తున్నాడు. పెళ్లి విషయంలో అతడు ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాడు. ‘నేను చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా. రాత్రిళ్లు నాకు అసలు నిద్రపట్టదు. నా జీవితాన్ని పంచుకునే వ్యక్తే నాకు దొరకరా అని భయమేస్తుంటుంది. నీకు పెళ్లి అవసరమా అంటూ ఈటల్లాంటి మాటలతో లేఖలు రాస్తుంటారు. నాకు ఇక పెళ్లి కాదని పెళ్లి సంబంధాలు చూడటాన్ని తల్లిదండ్రులు ఆపేశారు‘ అని అజీమ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
  ఇది కూడా చదవండి: ఇంట్లో నా భర్త నిద్రపోతున్నాడని చెప్పినా బలవంతం చేయడంతో.. ప్రియుడిని లోపలికి రానిచ్చిన భార్య.. ఆ తర్వాత..

  2019వ సంవత్సరంలో మొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను అజీమ్ లక్నోలో కలిశాడు. తనకు పెళ్లి విషయంలో సాయం చేయాల్సిందిగా కోరాడు. ఎనిమిది నెలల క్రితం కైరానా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనకు పెళ్లి జరిపించాల్సిందిగా కోరాడు. తన జీవిత భాగస్వామిని కనుక్కునేందుకు తనకు సాయం చేయాల్సిందిగా ఓ లేఖను కూడా వారికి సమర్పించాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కు ఈ విషయమై పోలీసులు ఓ లేఖను కూడా అందజేశారు. అయితే పోలీసులు, సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన అతడికి రాకపోవడంతో తాజాగా ఈ బుధవారం మరోసారి పోలీసుల వద్దకు వెళ్లాడు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. తాము ఈ విషయంలో ఏం చేయగలమో, అది చేస్తామని హామీ ఇచ్చారు.
  ఇది కూడా చదవండి: సోదరుడి రూమ్ కు వెళ్లిన యువతి.. నిద్రలోంచి మెలకువ వచ్చి తిరిగి ఇంటికి.. రెండ్రోజుల తర్వాత వాట్సప్ లో వచ్చిన ఫొటోను చూసి..
  Published by:Hasaan Kandula
  First published:

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు