హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వామ్మో.. జైలులో ఉన్న 26 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్.. ఎక్కడంటే.

వామ్మో.. జైలులో ఉన్న 26 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్.. ఎక్కడంటే.

బారాబంకి జైలు

బారాబంకి జైలు

Uttar Pradesh: జైలులో వివిధ కేసులలో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. దీనిలో దాదాపు 26 మందికి హెచ్ఐవీ పాజిటివ్ అని తెలింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

ఉత్తర ప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బారాబంకి.. జైలు అధికారులు.. ఖైదీలకు ఆగస్టు 10 నుంచి సెప్టెంబరు 1 వరకు జైలులో మూడు దశల హెచ్‌ఐవీ శిబిరంలో ఆరోగ్య శాఖ హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించారు. తాజాగా, వీటికి సంబంధించిన ఫలితాలు వచ్చాయి. దీనిలో 26 మందికి హెచ్ఐవీ పాజిటీవ్ గా తెలడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాగా, లక్నోలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో 26 మందిలో ఇద్దరు రెట్రోవైరల్ చికిత్స పొందుతున్నారని జైలర్ అలోక్ శుక్లా తెలిపారు.

బారాబంకి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవధేష్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా జైలులో 3,300 మంది ఖైదీలు ఉన్నారని, వారందరికీ హెచ్‌ఐవీ పరీక్షలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.

ఇదిలా ఉండగా గణేష్ వేడుకలో షాకింగ్ ఘటన జరిగింది.

యూపీలోని (UttarPradesh)లోని మెయిన్‌పురి(Mainpuri) సమీపంలోని కొత్వాలి ప్రాంతంలోని శివాలయంలో వినాయక చవితి వేడుకల్లో(Ganesh Utsav)  భాగంగా శనివారం రాత్రి భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఆ భజన బృందానికి చెందిన రవి శర్మ అనే కళాకారుడు హనుమంతుడి వేషంలో అందరినీ ఆకట్టుకున్నాడు. హనుమంతుడి వేషదారణలో హుషారుగా డ్యాన్స్ చేస్తూ ఉన్న రవి శర్మ(35) అనే వ్యక్తి హఠాత్తుగా గుండె పోటుతో కుప్పకూలిపోయాడు. అయితే ఇదంతా భజన, డ్యాన్స్‌లో భాగమేమోనని అందరూ అనుకున్నారు.

అయితే రవి శర్మ చాలా సేపటి వరకు పైకి లేవకపోవడంతో గమనించిన గణేష్ మండపం నిర్వాహకులు అతడిని వెంటనే మెయిన్‌పురి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ సంఘటన ఆ గణేష్‌ మండపంలో విషాదాన్ని నింపింది. అప్పటివరకు ఎంతో హుషారుగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేసిన వ్యక్తి మండపంలోనే ప్రాణాలు కోల్పోవడం వల్ల భక్తులు షాక్​కు గురయ్యారు. కాగా,ఆంజనేయస్వామి వేషధారణలో రవి శర్మ డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌(Viral Video) అవుతోంది.

Published by:Paresh Inamdar
First published:

Tags: HIV, Uttar pradesh, VIRAL NEWS

ఉత్తమ కథలు