రోజుకో కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను కంటమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ సృష్టించిన సునామి నుంచి పలు దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుతం టమోటా ఫ్లూ (Tomato flu) , మంకీ ఫ్లూ వైరస్ చెప కింద నీరులాగా విస్తరిస్తున్నాయి. కాగా, ఒడిశాలో టమాటా ఫ్లూ కల్లోలాన్నిరేపుతుంది. మే నెల ప్రారంభంలో కేరళలో దాదాపు 80కి పైగా కేసులు నమోదయ్యాయి.
ఇక ఒడిశాలోను (Odisha) చిన్నారులకు టమాటో ఫ్లూ వ్యాపిస్తుంది. చిన్నారుల చేతులు, పాదం, నోరు, పెదవుల మీద టమాటో ఫ్లూ (Tomato flu) సోకినట్లు వైద్యులు గుర్తించారు. అయితే, వీరిని ప్రత్యేకంగా క్వారంటైన్ లో ఉంచామని, వీరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సాధారణంగా 'టమాటా ఫ్లూ' అని పిలువబడే ఈ అంటు వ్యాధి పేగు వైరస్ల వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా పిల్లలలో వస్తుంది. పెద్దవారిలో ఈ వ్యాధి చాలా అరుదుగా సంక్రమిస్తుంది. ఎందుకంటే వారు సాధారణంగా వైరస్ నుండి రక్షించడానికి తగినంత బలమైన రోగనిరోధక వ్యవస్థలను కలిగి ఉంటారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. చాలా సందర్భాలలో, వైరల్ అనారోగ్యం జ్వరం, నోటిలో నొప్పితో కూడిన పుండ్లు, చేతులు, పాదాలు, పిరుదులపై బొబ్బలతో దద్దుర్లు వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.
భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రంలో 36 నమూనాలను సేకరించి పరీక్షించగా, 26 పాజిటివ్‌గా తేలిందని హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ బిజయ్ మహపాత్ర విలేకరులకు తెలిపారు. HFMD- సోకిన పిల్లలలో 19 మంది భువనేశ్వర్‌కు చెందినవారు, ముగ్గురు పూరీకి చెందినవారు మరియు ఇద్దరు కటక్, పూరీకి చెందిన వారని ఆరోగ్యఅధికారి మహపాత్ర తెలిపారు.
ఇదిలా ఉండగా కరోనా కొత్త వేరియంట్ గతంలో ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతోందని భావిస్తున్న వేళ.. మరో కొత్త వేరియంట్ (Corona new variant) ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) శుక్రవారం మరో కొత్త SARS-CoV-2 వేరియంట్‌ను గుర్తించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో వ్యాప్తిచెందుతున్న ఈ వేరియంట్‌ను 'ఆందోళనకరమైన వేరియంట్'గా (variant of concern) వర్గీకరించింది. దీనికి ఒమిక్రాన్ (Omicron) అని పేరు కూడా పెట్టింది. సౌత్ ఆఫ్రికాలోని నెట్వర్క్ ఫర్ జెనోమిక్స్ సర్వైలెన్స్ (NGS-SA) సంస్థ సోమవారం ఈ వేరియంట్‌ను గుర్తించింది. B.1.1.529 జినోమ్ కోడ్ ఉన్న ఈ వేరియంట్‌కు అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో వ్యాక్సిన్లు ఈ కొత్త వేరియంట్‌పై తక్కువ ప్రభావవంతంగా పనిచేయవచ్చని వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.