Home /News /trending /

25 YEAR OLD POSED AS PILOT ON INSTAGRAM DUPED OVER 30 WOMEN PAH

పైలట్ అనగానే కక్కుర్తి పడ్డారు.. 150 మంది మహిళలు.. 30 మంది అమ్మాయిలను... ఏంచేశాడంటే.

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Haryana: ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం చేస్తున్నానని అందమైన అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేవాడు. అంతే కాకుండా.. ఎయిర్ పోర్టులో ఉన్నట్లు డీపీలు, ఫోటోలు ఫేస్ బుక్, ఇన్ స్టాలో అప్ డేట్ చేస్తుండేవాడు.

మనలో చాలా మంది తరచుగా సోషల్ మీడియా వేదికగా మోసపోతున్నారు. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లకు సంబంధించి మోసపోయిన అనేక ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. అవతలి వారు.. ఎవరో కూడా తెలుసుకోకుండా ఫ్రెండ్ రిక్వెస్ట్ లను యాక్స్ ప్ట్ చేస్తున్నారు. దీంతో అమ్మాయిల మాదిరిగా మాట్లాడి, వలలో వేసుకుంటున్నారు. ఆ తర్వాత.. కొన్నిరోజుల తర్వాత.. మెల్లగా తమ నిజస్వరూపాన్ని బయటపెడుతున్నారు. ఇక పెళ్లిళ్ల విషయంలో కూడా అనేక మోసాలు జరుగుతున్నాయి.

ఫేస్ బుక్ లో, ఇన్ స్టాలో ఏదో ఒక డీపీలు పెట్టి అమ్మాయిలను ట్రాక్ లో పెడుతున్నారు. పెద్ద ఉద్యోగం చేస్తున్నట్లు, ఫారెన్ లో ఉంటున్నామని కలరింగ్ ఇస్తున్నారు. ఇదంతా చూసిన వారు.. నిజమే అనుకొని.. ఇట్టే వారి ట్రాక్ లో పడిపోతున్నారు. కొందరు మొదట ప్రేమిస్తున్నామని, ఆతర్వాత.. పెళ్లిప్రపోజల్ పెడుతున్నారు. ఈ క్రమంలో.. ఖర్చులకని అందినకాడికి డబ్బులు లాగేస్తున్నారు. కొన్నిరోజులకు అసలు నిజం తెలిసి..బాధితులు లబో దిబో మంటున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.



పూర్తి వివరాలు.. హర్యానాలోని (Haryana) గురుగ్రామ్ లో షాకింగ్ ఘటన జరిగింది. హేమంత్ శర్మ అనే 25 ఏళ్ల కుర్రాడు వందల మంది అమ్మాయిలకు, మహళలకు ఫేస్ బుక్ ,ఇన్ స్టాలో రిక్వెస్ట్ లు పెట్టాడు. కొందరు అతడి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్స్ ప్ట్ చేశారు. అయితే.. అతగాడు తాను ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం చేస్తున్నానని వారిని నమ్మించాడు. అంతే కాకుండా విదేశాలలో అనేక వ్యాపారాలు ఉన్నట్లు అమ్మాయిలకు మాయమాటలు చెప్పాడు. కొంత మంది ఇతగాడి ట్రాప్ లో పడ్డారు. అయితే.. అతను గురుగ్రామ్ కు చెందిన యువతికి కూడా ఇలాగే ట్రాప్ చేశాడు. ఆమె దగ్గర నుంచి 1 లక్షకు పైగా డబ్బులు తీసుకున్నాడు. ఆమెకు అనుమానం వచ్చి.. ఆరా తీయగా మోసగాడని బయటపడింది. దీంతో అతను.. వెంటనే పారిపోయాడు.

ఈ క్రమంలో.. యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు అతడిపై విచారణ చేపట్టారు. నిందితుడు.. హేమంత్ ను ఢిల్లీ శివారులో అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ లు, సిమ్ కార్డులు, స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణలో ఇప్పటి దాక.. 150 మంది మహిళలకు ఇన్ స్టాలో రిక్వెస్ట్ లు పెట్టాడు. అంతే కాకుండా.. మరో 30 మందితో డేటింగ్ లో ఉన్నట్లు తెలింది. దీంతో పోలీసుల అకౌంట్ లన్నింటికి డిలీట్ చేయించారు. పైలేట్ అని చెప్పుకుంటూ.. అవతలి వారిని మోసం చేసేవాడని పోలీసుల విచారణలో తెలింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Haryana, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు