వధువుకి 81 ఏళ్లు, వరుడికి 24 ఏళ్లు... గవర్నమెంట్ డ్యూటీ నుంచి తప్పించుకోవడానికి..

తన కుర్ర భర్త తనను బాగానే చూసుకుంటున్నాడని వృద్ధురాలు చెప్పింది. అయితే, అసలు ఆ యువకుడు ఎప్పుడూ ఈ చుట్టుపక్కల కనిపించలేదని ఇరుగుపొరుగువారు చెప్పారు.

news18-telugu
Updated: September 29, 2019, 9:51 PM IST
వధువుకి 81 ఏళ్లు, వరుడికి 24 ఏళ్లు... గవర్నమెంట్ డ్యూటీ నుంచి తప్పించుకోవడానికి..
81 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల యువకుడు
  • Share this:
కొన్ని దేశాల్లో యువతకు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ఉంటాయి. యువత తప్పనిసరిగా కొన్నాళ్లు ఆర్మీలో సేవలు అందించాల్సి ఉంటుంది. ఉక్రెయిన్‌లో కూడా ఇలాంటి నిబంధన ఉంది. అయితే, ఓ యువకుడు ఈ మిలటరీ డ్యూటీ నుంచి తప్పించుకోవడానికి ఓ ప్లాన్ వేశాడు. తనకు తెలిసిన 81 ఏళ్ల బామ్మను పెళ్లి చేసుకున్నాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన ‘భార్య’ను చూసుకోవాలి కాబట్టి, తాను మిలటరీలో జాయిన్ కావడం కుదరదని చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్మీలో చేరాలంటూ పిలుపు రావడంతో తన పెళ్లి సర్టిఫికెట్, వృద్ధ భార్య అనారోగ్య సమస్యలకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను అధికారులకు పంపాడు. తన భార్యను చూసుకోవడం తన విధి కాబట్టి, ఆర్మీ విధుల నుంచి తప్పించాలని కోరాడు. అన్ని వివరాలను పరిశీలించిన అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో అతడికి మినహాయింపు కల్పించారు. తన కుర్ర భర్త తనను బాగానే చూసుకుంటున్నాడని వృద్ధురాలు చెప్పింది. అయితే, అసలు ఆ యువకుడు ఎప్పుడూ ఈ చుట్టుపక్కల కనిపించలేదని ఇరుగుపొరుగువారు చెప్పారు.

First published: September 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు