హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

55 ఏళ్ల వ్యక్తితో 22 ఏళ్ల అమ్మాయి డేటింగ్..షుగర్ డాడీ అంటూ నెటిజన్లు సెటైర్లు

55 ఏళ్ల వ్యక్తితో 22 ఏళ్ల అమ్మాయి డేటింగ్..షుగర్ డాడీ అంటూ నెటిజన్లు సెటైర్లు

నికోల్ డౌన్స్- మైఖేల్‌

నికోల్ డౌన్స్- మైఖేల్‌

ప్రేమ గుడ్డిది(Love is Blind) అని అంటారు. ఒక వ్యక్తి ప్రేమలో పడినప్పుడు ,..తన ప్రేమికుడు లేదా ప్రేయసిది ఏ కులం, మతం, సంఘం లేదా రంగు చూడరు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రేమ గుడ్డిది(Love is Blind) అని అంటారు. ఒక వ్యక్తి ప్రేమలో పడినప్పుడు,..తన ప్రేమికుడు లేదా ప్రేయసిది ఏ కులం, మతం, సంఘం లేదా రంగు చూడరు. కానీ ఈ రోజుల్లో ప్రేమలో ఉన్న వ్యక్తులు తమ భాగస్వామి గురించి మరొక విషయాన్ని విస్మరించడం ప్రారంభించారు. ప్రేమకు వయస్సుతో కూడా సంబంథం లేదని అంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రేమాయణాలు నడుపుతున్నారు. చాలా మంది తమ కంటే పెద్దవాడైన లేదా చిన్నవయస్సు ఉన్న వ్యక్తులతో ప్రేమలో పడతున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికాకు(USA) చెందిన ఓ యువతి..వయస్సులో తనకంటే 33 ఏళ్లు పెద్దవాడితో ప్రేమాయణం నడుపుతుండటం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ జంట రిలేషన్ షిప్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

అమెరికాలోని మిచిగాన్‌లో నివాసం ఉంటున్న నికోల్ డౌన్స్ (22)కి 18 ఏళ్లు ఉన్నప్పుడు, తనకంటే 33 ఏళ్లు పెద్ద అంటే 51 ఏళ్ల వయసున్న మైఖేల్‌ను కలిసింది. తొలిచూపులోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. వెంటనే డేటింగ్ ప్రారంభించారు. 2018లో ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. వీరిద్దరూ మూడున్నరేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో తమ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నికోల్ డౌన్స్(Nicoe Downs) ప్రియుడు మైఖేల్‌ వయస్సు ఇప్పుడు 55 ఏళ్లు. మైఖేల్‌ లేనిదే తన జీవితం లేదని నికోల్ డౌన్స్ చెబుతోంది. వయసు పైబడిన వారితో రిలేషన్ షిప్ లో ఉండటం వల్ల పని చేయాల్సిన అవసరం లేదని నికోల్ డౌన్స్ ఓ ఇంటర్యూలో తెలిపింది. సోషల్ మీడియా సైట్ టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన వీడియోలో నికోల్...తనకు ఓ ఆపరేషన్ చేయించుకోవడానికి తన బాయ్‌ఫ్రెండ్ అవసరమైన డబ్బు ఇచ్చాడని కూడా చెప్పింది.

Flight Tickets Hike: పండుగ సీజన్‌లో పెరిగిన ఫ్లైట్ టిక్కెట్ ధరలు.. డొమెస్టిక్ ఫ్లైట్ ఛార్జీలు మరింత భారం..

ప్రజలు వెక్కిరించడం ప్రారంభించారు.

నికోల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా తన జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉంది. వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలపై తరచూ కామెంట్స్ చేస్తుంటారు. కొన్ని పాజిటివ్ మరికొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నా నికోల్ అవేవి పట్టించుకోకుండా తన ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. ఇద్దరి వయస్సులో ఇంత వ్యత్యాసం ఉండటంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తనను తరచూ దూషించేవారని నికోల్ డౌన్స్ చెప్పారు. ఒక్కోసారి తమను తండ్రీ కూతుళ్లుగా, ఒక్కోసారి తాత- మనవరాలుగా భావిస్తుంటారని తెలిపింది. మైఖేల్‌ ను షుగర్ డాడీ అని వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అదే సమయంలో చాలా మంది నికోల్.. డబ్బు కోసమే మైఖేల్‌ తో ఉందని ఆరోపిస్తున్నారు.

First published:

Tags: Love affair, USA

ఉత్తమ కథలు