హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

20th Kargil Vijay Diwas: కార్గిల్ విజయ్ దివస్ వేడుకలకు సర్వం సిద్ధం

20th Kargil Vijay Diwas: కార్గిల్ విజయ్ దివస్ వేడుకలకు సర్వం సిద్ధం

కార్గిల్ విజయ్ దివాస్(జులై 26)

కార్గిల్ విజయ్ దివాస్(జులై 26)

20th Kargil Vijay Diwas | జమ్ముకశ్మీర్‌లో కార్గిల్ జిల్లాలోని ద్రాస్ వార్ మెమోరియల్ వద్ద శుక్రవారం(జులై 26) 20వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, రాజ్ నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు పాల్గొంటారు.

ఇంకా చదవండి ...

  ‘ఆపరేషన్ విజయ్’లో పాలుపంచుకుని ప్రాణాలు అర్పించిన కార్గిల్ అమరవీరులను యావత్ జాతి మరోమారు స్మరించుకోనుంది. దేశ వ్యాప్తంగా 20వ కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను శుక్రవారం(జులై 26) ఉదయం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ కార్గిల్ జిల్లాలో ద్రాస్‌లో కార్గిల్ విజయ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పాల్గొననున్నారు. కార్గిల్ విజయ జ్యోతి ర్యాలీ దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి ద్రాస్‌కు చేరుకోనుంది. ఢిల్లీలో జరిగిన వేడుకలో ఈ విజయ జ్యోతిని సుబేదార్ జితు రాయ్‌కి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అందజేశారు.

  ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్

  భారత ఆర్మీలో పనిచేస్తున్న క్రీడాకారులు, వీరసైనికులు ఈ విజయ జ్యోతిని ద్రాస్‌కు ర్యాలీగా తీసుకెళ్తున్నారు. ఉత్తర భారతావనిలోని పలు నగరాల మీదుగా పయనిస్తూ ఈ ర్యాలీ ద్రాస్‌కి చేరుకుంటుంది. శుక్రవారం(జులై 26న) ద్రాస్‌లో ఈ కార్గిల్ విజయ జ్యోతిని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్వీకరిస్తారు. ద్రాస్‌లోని వార్ మెమోరియల్ దగ్గర జరిగే ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులు పాల్గొంటారు.

  కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ వ్యాప్తంగానూ త్రివిధ దళాలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నాయి.

  Published by:Janardhan V
  First published:

  Tags: Indian Army, Jammu and Kashmir, Kargil Vijay Diwas, Ramnath kovind

  ఉత్తమ కథలు