Election Dates 2019..సార్వత్రిక ఎన్నికలు ఏయే రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు?

Election dates 2019 | కేంద్ర ఎన్నికల సంఘం 2019 సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించింది. మొత్తంగా ఏడు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికల నిర్వహణ ఉంటుందని చెప్పారు.

news18-telugu
Updated: March 10, 2019, 7:21 PM IST
Election Dates 2019..సార్వత్రిక ఎన్నికలు ఏయే రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 10, 2019, 7:21 PM IST
కేంద్ర ఎన్నికల సంఘం 2019 సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించింది. మొత్తంగా ఏడు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికల నిర్వహణ ఉంటుందని చెప్పారు. కర్నాటక, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల్లో రెండు దశల్లో.. అస్సాం, చత్తీస్ గఢ్‌ రాష్ట్రాల్లో మూడు దశల్లో.. జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో నాలుగు దశల్లో.. జమ్మూకశ్మీర్‌లో ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. బీహార్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ్‌బెంగాళ్ రాష్ట్రాల్లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

మే 23న ఫలితాలు

ఏప్రిల్ 1 తొలి దశ, ఏప్రిల్ 18న రెండోదశ, ఏప్రిల్ 23న మూడో దశ, ఏప్రిల్ 29న నాలుగో దశ, మే 6న ఐదో దశ, మే 12న ఆరో దశ, మే 19న ఏడో దశ ఎన్నికలు జరగనుండగా.. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి.

ఏప్రిల్ 11న జరిగే తొలి దశ ఎన్నికల్లో మొత్తం 91 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో 25, అరుణాచల్‌ప్రదేశ్‌లో 2, అస్సాంలో 5, బీహార్‌లో 4, చత్తీస్‌గఢ్ 1, జమ్ముకశ్మీర్‌లో 2, మహారాష్ట్రలో 7, మణిపూర్‌లో 1, మేఘాలయలో 2, మణిపూర్‌లో 2, నాగాలాండ్‌లో 1, మిజోరాంలో 1, తెలంగాణలో 17, యూపీలో 8, ఉత్తరాఖండ్‌లో 5, పశ్చిమబెంగాళ్‌లో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.



ఏప్రిల్ 18న జరిగే రెండో దశ ఎన్నికల్లో భాగంగా అస్సాంలో 5, బీహార్‌లో 5, చత్తీస్‌గఢ్ 3, జమ్ము కశ్మీర్‌లో 2, కర్నాటకలో 14, మహారాష్ట్రలో 10, మణిపూర్‌లో 1, ఒడిశాలో 5, తమిళనాడులో 39, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8,  పాండిచ్చేరి 1, పశ్చిమ్‌బెంగాళ్‌లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మూడో దశలో భాగంగా ఏప్రిల్ 23న అస్సాంలో 4, బీహార్‌లో 5, చత్తీస్‌గఢ్‌లో 7, గుజరాత్‌లో 26, గోవాలో 2, జమ్ముకశ్మీర్ 1, కర్నాటకలో 14, కేరళలో 20, మహారాష్ట్రలో 14, ఒడిశాలో 6, యూపీలో 10, పశ్చిమబెంగాళ్‌లో 5 స్థానాలతో పాటు దాద్రానగర్ హవేలి, డామన్ డయ్యు స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

4వ దశ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 29న బీహార్‌లో 5, జమ్ముకశ్మీర్‌లో 1, జార్ఖండ్‌లో 3, మధ్యప్రదేశ్‌లో 6, మహారాష్ట్రలో 17, ఒడిశాలో 6, రాజస్థాన్‌లో 13, ఉత్తర్‌ప్రదేశ్‌లో 13, పశ్చిమబెంగాళ్‌లో 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఐదో దశ ఎన్నికల్లో భాగంగా మే 6న బీహార్‌లో 5, జమ్ముకశ్మీర్‌లో 2, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 7, రాజస్థాన్‌లో 12, ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, పశ్చిమ్‌బెంగాళ్‌లో 7 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

మే 12న జరగనున్న 6వ దశ ఎన్నికల్లో భాగంగా బీహార్‌లో 8, జమ్మూ కశ్మీర్‌లో 2, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 7, రాజస్థాన్‌లో 12, ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, పశ్చిమ్‌బెంగాళ్‌లో 7 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

చివరగా మే 19న ఏడో దశ ఎన్నికల్లో భాగంగా బీహార్‌లోని 8 , జార్ఖండ్‌లోని 3, మధ్యప్రదేశ్‌లోని 8, పంజాబ్‌లోని 13,  పశ్చిమ్‌బెంగాళ్‌లోని 9, చండీగఢ్‌లోని 1, ఉత్తర్ ప్రదేశ్‌లోని 13, హిమాచల్ ప్రదేశ్‌లోని 4.. మొత్తంగా 59 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
First published: March 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు