ఫోన్ లెన్స్‌తో అద్భుత ఫొటోలు తీస్తున్న యువకుడు... ఇంటర్నెట్ సెన్సేషన్

మన కంటికి కనిపించని ప్రపంచం మరొకటి ఉంటుంది. అదే టైనీ వరల్డ్. ఆ ప్రపంచంలో దృశ్యాల్ని ఫొటోలు తీస్తూ... అందరి ప్రశంసలూ పొందుతున్నాడు ఓ యువకుడు. ఆ విశేషాలు తెలుసుకుందాం.

news18-telugu
Updated: January 18, 2020, 2:58 PM IST
ఫోన్ లెన్స్‌తో అద్భుత ఫొటోలు తీస్తున్న యువకుడు... ఇంటర్నెట్ సెన్సేషన్
ఫోన్ లెన్స్‌తో అద్భుత ఫొటోలు తీస్తున్న యువకుడు... ఇంటర్నెట్ సెన్సేషన్ (credit - twitter - Gabbbar)
  • Share this:
20 ఏళ్ల శశీ చేతిలో అందరి లాగే స్మార్ట్ మొబైల్ ఉంది. జనరల్‌గా ఇలా మొబైల్ ఉన్నవాళ్లు సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. తమిళనాడులోని... వెల్లూరుకి చెందిన శశి మాత్రం కాస్త కొత్తగా ఏదైనా చెయ్యాలనుకున్నాడు. అప్పుడో పురుగు అతనికి కనిపించింది. దాన్ని ఫొటో తీద్దామని ప్రయత్నించాడు. ఎన్ని సార్లు తీస్తున్నా... కెమెరాను దాని దగ్గరకు తీసుకెళ్లగానే ఫోకస్ అవుటై... జిడ్డుగా, పిక్సలేట్ అవుతూ కనిపిస్తోంది. ఫొటో బ్లర్ అవుతోంది. ఇందుకు కారణం ఏంటా అని ఆలోచిస్తే... కొత్త విషయం తెలిసింది. ఆ ఫోన్‌కి ఉన్న కెమెరాతో... చిన్న చిన్న పురుగులు, కీటకాల వంటి వాటిని దగ్గరగా ఫొటో తియ్యలేం. ఈ విషయాన్ని గ్రహించిన శశీ... ఇంటర్నెట్‌లో చదివి... తన ఫోన్‌కి లెన్స్ సెట్ చేసుకొని... అలాంటివి తియ్యవచ్చని తెలుసుకున్నాడు. వెంటనే అందుకు సరిపడే లెన్స్ తెప్పించుకున్నాడు. ఇక వాటిని సెట్ చేసి... టైనీ వరల్డ్‌లో అడుగు పెట్టాడు. ఈగలు, దోమలు, పురుగులు, చీమలు వంటి ఎన్నో కీటకాల్ని అత్యంత దగ్గరగా, జూమ్ చేసి ఫొటోలు తీస్తున్నాడు. ఫలితంగా మనం రెగ్యులర్‌గా చూసే ఫొటోల్లోలా కాకుండా ఆ కీటకాలు సరికొత్తగా, ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కొన్నింటిని చూస్తే... ఈ కీటకాల్లో ఇంత అందం ఉందా అనిపించేలా ఉంటున్నాయి ఆ ఫొటోలు. ఫలితంగా శశీ ఇప్పుడే ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయాడు. చాలా మంది అతన్ని ఫాలో అవుతూ... అతనిలా ఫొటోలు తీసేందుకు ప్రయత్నిస్తుండటం విశేషం.

First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading