HOME »NEWS »TRENDING »2 years kid catches a snake thinking its a stick video goes viral sk

పార్క్‌లో 10 అడుగుల పామును పట్టిన బుడ్డోడు.. పేరెంట్స్ షాక్.. వైరల్ వీడియో

పార్క్‌లో 10 అడుగుల పామును పట్టిన బుడ్డోడు.. పేరెంట్స్ షాక్.. వైరల్ వీడియో
పామును పట్టుకున్న చిన్నారి (Image:The SUN)

పాము దాదాపు 10 అడుగులు ఉంటుంది. నలుపు రంగులో అచ్చం కర్రలాగే ఉండడంతో.. కర్రేమోనని ఆ బాలుడు భ్రమపడ్డాడు. కొడుకు చేతిలో పామును చూసి తండ్రి షాక్ తిన్నాడు.

  • Share this:
    పిల్లలపై ఈగ కూడా వాలనీయరు తల్లిదండ్రులు. చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేరు. సాధారణంగా పిల్లలను క్రిమి కీటకాలకు దూరంగా ఉంచుతారు పేరెంట్స్. ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులతో ఆడుకుంటున్నా.. ఓ కన్నేసి ఉంచుతారు. అలాంటిది ఓ చిన్నారి ఏకంగా పామును పట్టుకున్నాడు. నిండా రెండేళ్లు కూడా బుడ్డోడు తల్లిదండ్రుల ముందే.. అందరూ చూస్తుండగా.. పేద్ద పామును చేతులతో పట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రిటన్‌లో ఈ ఘటన జరిగినప్పటికీ ఏ ప్రాంతంలో జరిగింది. ఆ చిన్నారి ఎవరు? అనే వివరాలు తెలియ రాలేదు.

    ది సన్ వార్తా సంస్థ ఈ వీడియోను తమ వెబ్‌సైట్లో ప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. ఓ ఫ్యామిలీ పార్క్‌కు వెళ్లింది. రెండేళ్ల బాబు పార్క్‌లో తమ పెంపుడు కుక్కతో ఆడుకుంటూ కనిపించాడు. ఆ సన్నివేశాలను బాలుడి తండ్రి తన మొబైల్ కెమెరాలో చిత్రీకరించాడు. అలా ఆ బాలుడు ఆడుకుంటూ పార్క్‌లో ఉన్న ఓ కర్రను తీసుకొని దూరంగా విసిరేశాడు. కుక్క కర్ర దగ్గరకు పరుగెత్తింది. దాన్ని నోట కరచుకొని ఎగురుకుంటూ దూరంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత మరో కర్రను అందుకున్నాడు బాలుడు. కానీ అది కర్ర కాదు. పొడవాటి పాము. దాదాపు 10 అడుగులు ఉంటుంది. నలుపు రంగులో అచ్చం కర్రలాగే ఉండడంతో.. కర్రేమోనని ఆ బాలుడు భ్రమపడ్డాడు. కొడుకు చేతిలో పామును చూసి తండ్రి షాక్ తిన్నాడు. ఒక్క ఉదుటున పరుగెత్తి ఆ పామును దూరంగా విసిరేశాడు. ఈ దృశ్యాలన్నీ అతడి కెమెరాలో రికార్డయ్యాయి.



    ఆ కుక్క కూడా కర్రే అనుకొని దగ్గరకు వెళ్లింది. పాము కదులుతుండడంతో భయపడి వెనక్కి వచ్చేసింది. ఐతే అది ఏరకం పామో తెలియలేదు. విషపూరితమైనా? కాదా? అన్న వివరాలు కూడా తెలియలేదు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ది సన్ వార్తా సంస్థ పోస్ట్ చేసిన వీడియోను ట్విటర్‌లో ఇప్పటి వరకు దాదాపు 70వేల మంది వీక్షించారు. వామ్మో..ఇది షాకింగ్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:January 04, 2021, 16:11 IST