చైనాలో షాకింగ్...యువతి మెదడు CT Scan చేసిన డాక్టర్లకు మైండ్ బ్లాక్...

యువతి పసితనంలోనే ఈ సూదులు ఉద్దేశపూర్వకంగా చొప్పించారని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే పెద్దయ్యాక గట్టిపడిన పుర్రెలో అటువంటి మందపాటి సూదులను చొప్పించడం అసాధ్యమని వైద్యులు అంచనా వేస్తున్నారు.

news18-telugu
Updated: October 18, 2020, 5:33 PM IST
చైనాలో షాకింగ్...యువతి మెదడు CT Scan చేసిన డాక్టర్లకు మైండ్ బ్లాక్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
చాలా మందికి యాక్సిడెంట్లు జరిగినప్పుడు చిన్న చిన్న లోహపు ముక్కలు శరీరంలో చొచ్చుకుపోతాయి. వాటిని తొలగించినప్పటికీ, కొన్ని మాత్రం ఎముక్కల్లోనూ, వెన్ను పూసలోనూ ఇరుక్కున్నప్పుడు మాత్రం డాక్టర్లు అలాగే వదిలేస్తుంటారు. కానీ చైనాలో మాత్రం అద్భుతం జరిగింది. ఒక కారు ప్రమాదం తర్వాత చైనీస్ మహిళ CT స్కాన్ చేయించుకోగా, ఆమె మెదడులో రెండు పొడవైన లోహపు సూదులు ఉన్నాయని బయటపడింది. జెంగ్‌జౌకు చెందిన 29 ఏళ్ల మహిళకు చిన్న కారు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత డాక్టర్‌ సిటి స్కాన్‌ చేయమని కోరాడు.

మహిళ యొక్క సిటి స్కాన్ నివేదికను చూసి వైద్యులు ఆశ్యర్యపోయారు. ఎందుకంటే ఆమె తలపై గాయాల సంకేతాలు కనిపించలేదు, కాని సిటి స్కాన్ లోనే వైద్యులు చాలా విచిత్రమైన విషయం చూశారు. రెండు సూదులు 5 సెం.మీ పొడవు, 4.9 మిమీ వ్యాసం కలిగి ఉన్నవి ఆమె మెదడులో లోతుగా దిగిఉన్నట్లు గుర్తించారు. విచిత్రం ఏమిటంటే, కారు ప్రమాదంతో సూదులకు ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే వాటి చొచ్చుకుపోవటం వలన తల మీద ఎలాంటి గాయాల గుర్తులు లేవు. అయితే ఆ స్త్రీ తన జీవితంలో ఏ తలకు కూడా తీవ్రమైన గాయం కాలేదని తెలిపింది.

మెదడులో రెండు సూదులు ఉన్న రిపోర్టు ఇదే ( News 18 Hindi)


ఈ వింత ప్రకటనకు సంబంధించి, యువతి పసితనంలోనే ఈ సూదులు ఉద్దేశపూర్వకంగా చొప్పించారని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే పెద్దయ్యాక గట్టిపడిన పుర్రెలో అటువంటి మందపాటి సూదులను చొప్పించడం అసాధ్యమని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఆమె మెదడు పరిస్థితి గురించి మహిళను అడిగినప్పుడు, ఆమె తనకు ఎప్పుడూ ఎలాంటి నొప్పిఅనుభవించలేదని తెలిపింది. అయితే ఇలాంటి కేసును తాము ముందెప్పుడూ చూడలేదని డాక్టర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సిటి స్కాన్‌లో వెల్లడైన సమాచారం గురించి మహిళ ఇప్పటికే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చైనా వెబ్‌సైట్ సోహు తెలిపింది. సూదులు ఆమె మెదడులోకి చొప్పించడంపై తనకు కొంతమందిపై సందేహాలు ఉన్నాయని, అయితే ఆమె వెంటనే వారి పేర్లను బయటపెట్టడానికి ఇష్టపడలేదని నివేదిక పేర్కొంది.
Published by: Krishna Adithya
First published: October 18, 2020, 5:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading