Home /News /trending /

2 FEET LONG CHICKEN ROLL DELHI STALL MAKES BIGGEST CHICKEN ROLL EVER WATCH VIDEO HERE GH SK

Biggest Chicken Roll: వామ్మో.. 2 అడుగుల పెద్ద చికెన్ రోల్.. ఎక్కడ లభిస్తుందంటే.. వీడియో వైరల్

అతి పెద్ద చికెన్ రోల్

అతి పెద్ద చికెన్ రోల్

Chicken Egg Roll: ఈ చికెన్ ఎగ్ రోల్ ఏకంగా రెండు అడుగుల పొడవు ఉంటుంది. అంటే అరచేయి నుంచి మోచేయి కంటే పెద్దది అన్నమాట.

సాధారణంగా చికెన్ రోల్ అంటే ఎంత ఉంటుంది. మన చేతి కంటే కాస్త పొడుగ్గా ఉంటుంది. కానీ రెండు చేతులతో కలిపి పట్టుకున్నా సరే.. సరిపోని పెద్ద చికెన్ రోల్ మీరెప్పుడైనా చూశారా? అలాంటి చికెన్ రోల్‌ను తయారు చేసింది ఢిల్లీలోని ఒక ఫుడ్ సెంటర్. మోడల్ టౌన్‌లో ఉన్న పాట్నా రోల్ సెంటర్ వారు దీన్ని తయారుచేశారు. ఈ రోల్ రెండు అడుగుల పొడవు ఉంటుంది. అంటే అరచేయి నుంచి మోచేయి కంటే పెద్దది అన్నమాట. తనీష్ శర్మ అనే ఫుడ్ బ్లాగర్ దీన్ని తింటూ దానికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ అతి పెద్ద వంటకం గురించి ప్రపంచానికి తెలిసింది.

దీని గురించి ఆ బ్లాగర్ ఇన్‌స్టా వీడియోలో వివరించారు. ఇది అతి పెద్ద చికెన్ ఎగ్ రోల్ అని చెప్పారు. అంతే కాదు.. దీన్ని పూర్తిగా తిన్న వారికి ప్రైజ్ మనీ కూడా చెల్లిస్తానని చెప్పడం విశేషం. అలా తినడాన్ని వీడియో తీసి ఒక్క మెసేజ్ చేస్తే చాలు.. చక్కటి ప్రైజ్ మనీ చెల్లిస్తానని చెప్పారు. ఈ రోల్‌ని తయారు చేయడానికి పది గుడ్లను ఉపయోగించారట.



* ఎలా తయారు చేశారు?
ముందు రెండు అడుగుల వ్యాసం ఉన్న చపాతీని అప్పటికప్పుడు తయారుచేసి.. దాన్ని కొద్దిగా కాలుస్తారు. తరువాత దానిపై పది గుడ్లు, అందులో చికెన్ సీఖ్ రోల్, మటన్ సీఖ్ రోల్, నూడుల్స్ వంటివన్నీ వేశారు. ఆ తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్ లాంటి ఇతర కూరగాయలు, మయోనైజ్, తందూరీ సాస్, ఇతర సాసెస్ వేసి రోల్‌ని చుడతారు. ఆ తర్వాత అల్యూమినియం ఫాయిల్ చుట్టి అందిస్తారు. ఈ రోల్ ధర తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. వెజ్ రోల్‌ను రూ.400 కి అందిస్తారు. ఇందులో సీఖ్ కబాబ్‌కి బదులు పనీర్ కబాబ్ చేర్చుతారు. అదే నాన్ వెజ్ రోల్ అయితే చికెన్, మటన్ కలిపి అందిస్తారు. దీని ధర రూ.600 మాత్రమే.

ఈ చికెన్ రోల్ తో పాటు మరెన్నో అద్భుతమైన రోల్స్ ఆ ప్రదేశంలో అందుబాటులో ఉంటాయట. ఆరోగ్యకరమైన రోల్స్ కూడా అందుబాటులో ఉంటాయని ఫుడ్ బ్లాగర్ తనీష్ ఈ వీడియోలో వెల్లడించడం విశేషం. మీరు కూడా ఢిల్లీకి వెళ్తే ఈ అతిపెద్ద చికెన్ ఎగ్ రోల్ తినడం మర్చిపోవద్దు. కావాలంటే స్నేహితులతో కలిసి పోటీ పెట్టుకొని తినడానికి ప్రయత్నించండి.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: New Delhi, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు