దేశమంతట ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే దేశంలో ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని ఐబీ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. దీంతో కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు అప్రమత్తయ్యాయి. ఇప్పటికే ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నో ఫైయింగ్ జోన్ గా ప్రకటించారు. అంతే కాకుండా.. పోలీసులు, ఉన్నతాధికారులు అడగడుగున తనీఖీలు చేపడుతున్నారు. ఎలాంటి అనుమానస్పద వస్తువులు, కదలికలు కన్పించిన వదిలిపెట్టుకుండా తనిఖీ చేపట్టారు. అయితే.. నాగాలాండ్ లో తిరుగుబాటు దారులు.. సైనికులపై కాల్పులకు తెగబడ్డాడు. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (NSCN-K-YA) ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.
పూర్తి వివరాలు.. నాగాలాండ్‌లో (nagaland) సోమవారం కాల్పుల ఘటన తీవ్ర కలకలంగా మారింది. మోన్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఒక తిరుగుబాటు బృందం జరిపిన దాడిలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ సైనికులు గాయపడ్డారు. న్యాసా గ్రామంలో జరిగిన దాడిలో ఇద్దరు సిబ్బందికి బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే వీరిని సహాచర సిబ్బంది.. అస్సాంలోని జోర్హాట్‌లోని సైనిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన జవాన్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కాగా, ఈ దాడి వెనుక.. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (NSCN-K-YA) ఉన్నట్లు సమాచారం.
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు తిరుగుబాటు గ్రూపులు చేసే ప్రయత్నాలను నిరోధించేందుకు అస్సాం రైఫిల్స్ దళాలను రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాలలో మోహరించారు. మోన్ జిల్లాలోని న్యాసా గ్రామం నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ మధ్య సరిహద్దులో ఉంది. మూలాల ప్రకారం, అస్సాం రైఫిల్స్ సిబ్బంది తదుపరి దాడులు జరగకుండా అనేక మెరుపుదాడి చేశారు. అదే విధంగా... మరో సంఘటనలో, సోమవారం ఉదయం 11:30 గంటలకు, సరిహద్దులోని మయన్మార్ వైపు నుండి తిరుగుబాటు దళాలు గాలిలో అనేక రౌండ్లు కాల్పులు జరిపాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Independence Day 2022, Nagaland, VIRAL NEWS