(K.Lenin,News18,Adilabad)
చూడటానికి బాగానే ఉంటున్నారు. అందరితో కలిసి సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇంతలోనే అందరూ చూస్తుండగానే షడన్‌గా కుప్పకూలిపోతున్నారు. వయసుతో పని లేకుండా 15ఏళ్ల వయసు వాళ్ల దగ్గర నుంచి 50ఏళ్ల వయసులో ఉన్న వారు గుండెపోటుకు గురవుతున్నారు. రెప్పపాటులోనే ప్రాణాలు విడుస్తున్నారు. నిర్మల్ (Nirmal)జిల్లాలో కూడా ఓ19ఏళ్ల యువకుడు పెళ్లి వేడుకల (Wedding ceremonies)ముగింపులో డ్యాన్స్(Dance) చేస్తుండగా హార్ట్ ఎటాక్(Heart attack)రావడంతో కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్నవాళ్లంతా అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికి ప్రయోజనం లేకపోయింది.
పెళ్లి వేడుకల్లో విషాదం..
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో రిసెప్షన్ జరుగుతోంది. పాటలు, ఆ పాటలకు తగ్గట్లుగా డ్యాన్స్‌లు చేస్తున్న యువకులతో రిసెప్షన్ ఉత్సాహంగా సాగుతుండగానే ఒక్కసారి గా విషాదకర సంఘటన చోటుచేసుకుంది. డ్యాన్స్ చేస్తున్న 19ఏళ్ల ముత్యం అనే యువకుడు గుండెపోటుతో చనిపోయాడు. గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుని వివాహం శుక్రవారం బైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది. శనివారం పార్డి(కె) “లో వివాహ వేడుకకు సంబంధించి విందు జరిగింది. ఇందులో పెళ్లి కుమారుని సమీప బంధువు, స్నేహితుడైన ముత్యం అనే యువకుడు డ్యాన్స్ చేశాడు. పెళ్లికి వచ్చిన వాళ్లంతా అతను వేస్తున్న స్టెప్పులు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలోనే ముత్యం ఒక్కసారిగా కుప్ప కూలి పడిపోయాడు.
డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలాడు..
పడిపోయిన వెంటనే ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు ముత్యం. ఇది గమనించిన పెళ్లి వారు, స్థానికులు ముత్యంకు ట్రీట్‌మెంట్ అందించేందుకు వెంటనే హుటహూటిన బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే యువకుడు మృతి చెందినట్లుగా డాక్టర్లు తెలిపారు. మృతి చెందిన యువకుడు ముత్యం మహరాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన వాడు కావడంతో శనివారం రాత్రి మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించారు.
అర్దాంతరంగా ఆగిపోతున్న గుండెలు..
ఈమధ్య కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య మరింత ఎక్కువ అవుతోంది. వాకింగ్ చేస్తూ, గ్రౌండ్‌లో బ్యాడ్మింటెన్ ఆడుతూ..చివరకు గుజరాత్‌లో క్రికెట్ మైదానంలో బౌలింగ్ వేస్తున్న ప్లేయర్ కూడా హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిపోయిన వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యుక్త వయసులో ఉన్న వాళ్లకు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయనే విషయంపై డాక్టర్లు అనేక విషయాలు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nirmal district, Telangana News, Viral Video