హెయిర్ డై వికటించి మొహం వాచిపోయింది

భారతదేశంలోనూ పీపీడీ వికటించిన ఘటనలెన్నో. ఎలా ఉపయోగించాలో, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకొని వాడటం మంచిది. లేకపోతే చివరికిలా వికటించే ప్రమాదం ఉంది. హెన్నాతో పాటు చాలా హెయిర్ డైస్‌లో పీపీడీ కెమికల్ ఉంటుంది. ఇప్పటికే చాలా సంస్థలు పీపీడీ చిమ్ముతున్న విషంపై గళమెత్తాయి.

news18-telugu
Updated: December 3, 2018, 5:50 PM IST
హెయిర్ డై వికటించి మొహం వాచిపోయింది
హెయిర్ డై వికటించి మొహం వాచిపోయింది
news18-telugu
Updated: December 3, 2018, 5:50 PM IST
అందం కోసం హెయిర్ డై వేసుకునేవాళ్లకు ఇది ఓ హెచ్చరిక. 19 ఏళ్ల యువతి ఇలాగే స్టైల్ కోసం హెయిర్ డై వేసుకుంటే వికటించింది. విషం తలకెక్కింది. మొహమంతా వాచిపోయింది. అందం సంగతేమో కానీ... అందవికారంగా మారిపోయింది. 19 ఏళ్ల ఫ్రెంచ్ యువతి పారఫెనలీన్‌డయమీన్(పీపీడీ) హెయిర్‌ డై వేసుకుంది. అంతే... జుట్టు రంగు మారడం ఏమో కానీ... రియాక్షన్ తీవ్రంగా ఉంది. ఆ విషం తలకెక్కింది. మొహం వాచిపోయింది. తల రకరకాలుగా వంకర్లు తిరిగిపోయింది.

పీపీడీ హెయిర్ డై అప్లై చేసి కాసేపటికే ఇలా వికటించినట్టు సదరు యువతి తెలిపింది. ఎంత వాడాలో అంతే వాడినా తెల్లారేసరికి నుదురు ఐదు సెంటీమీటర్లు పెరిగిపోయింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లడంతో అడ్మిట్ చేసి చికిత్స అందించారు. కణజాలాన్ని దెబ్బతీయడం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యల్లాంటి తీవ్రమైన రోగాలకు కారణం కావొచ్చని వైద్యులు తేల్చారు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్‌ఫర్మేషన్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం పీపీడీ వికటించడం చాలా సాధారణం.

2017లో 24 ఏళ్ల యువతికి హెయిర్ డై కారణంగా తీవ్రమైన సమస్యల్నే ఎదుర్కొంది. ఈస్ట్ ఆఫ్రికా, మధ్య, ప్రాశ్చ్య దేశాల్లోనే కాదు... భారతదేశంలోనూ పీపీడీ వికటించిన ఘటనలెన్నో. ఎలా ఉపయోగించాలో, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకొని వాడటం మంచిది. లేకపోతే చివరికిలా వికటించే ప్రమాదం ఉంది. హెన్నాతో పాటు చాలా హెయిర్ డైస్‌లో పీపీడీ కెమికల్ ఉంటుంది. ఇప్పటికే చాలా సంస్థలు పీపీడీ చిమ్ముతున్న విషంపై గళమెత్తాయి.

ఇవి కూడా చదవండి:మీకూ నోమోఫోబియా ఉందా? స్మార్ట్‌ఫోన్‌తో ఈ రోగం ఖాయమా?

అర్థరాత్రి వరకు మేల్కొంటే గుండెపోటు ఖాయం

డిసెంబర్ 25న ట్రెయిన్ 18 ప్రారంభం: వేగం గంటకు 180 కిలోమీటర్లు
Loading...
స్మార్ట్‌ఫోన్‌లో పబ్‌జీ గేమ్: ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి...

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ డేస్ సేల్: స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే

ఫిక్స్‌డ్ డిపాజిట్స్: ఏ బ్యాంక్ మంచిది?
First published: December 3, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...