• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • 15 YEARS OLD STUDENT INNOVATE ELECTRIC BIKE IN LOCKDOWN PERIOD IN KARNATAKA FULL DETAILS HERE HSN GH

Electric Bike: రూ.25 వేలతోనే ఎలక్ట్రిక్ బైకును తయారు చేసిన 15ఏళ్ల విద్యార్థి.. లాక్ డౌన్ లో కొత్త ఆవిష్కరణ

Electric Bike: రూ.25 వేలతోనే ఎలక్ట్రిక్ బైకును తయారు చేసిన 15ఏళ్ల విద్యార్థి.. లాక్ డౌన్ లో కొత్త ఆవిష్కరణ

10వ తరగతి విద్యార్థి ప్రతామేషా సుతారా

సుదీర్ఘకాలం పాటు సెలవులు లభించడంతో ఎక్కువ మంది విద్యార్థులు మొబైల్ లో గేమ్స్ ఆడటం వంటి వాటి ద్వారా తమ విలువైన సమయాన్ని వృదా చేసుకున్నారు. అయితే, 15 ఏళ్ల ఒక విద్యార్థి మాత్రం వారికి పూర్తి భిన్నంగా సెలవుదినాన్ని పూర్తిగా ఉపయోగించుకొని అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు.

  • Share this:
కరోనా మహమ్మారి వలలో ఇతర రంగాలే కాదు.. విద్యారంగం కూడా చిక్కుకొని విలవిల్లాడింది. కరోనాతో దాదాపు ఏడాది పాటు పిల్లలు తరగతి గదికి దూరమయ్యారు. సుదీర్ఘకాలం పాటు సెలవులు లభించడంతో ఎక్కువ మంది విద్యార్థులు తమ స్నేహితులతో ఆడుకోవడం, ఎక్కువ సేపు మొబైల్ గేమ్స్ ఆడటం వంటి వాటి ద్వారా తమ విలువైన సమయాన్ని వృదా చేసుకున్నారు. అయితే, 15 ఏళ్ల ఒక విద్యార్థి మాత్రం వారికి పూర్తి భిన్నంగా సెలవుదినాన్ని పూర్తిగా ఉపయోగించుకొని అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇంతకీ ఎవరతను? ఏం చేశాడు అనే విషయాలను తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లా నిప్పాని తాలూకాకు చెందిన 10వ తరగతి విద్యార్థి ప్రతామేషా సుతారా లాక్ డౌన్ సమయంలో సృజనాత్మకంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. స్వయంగా ఎలక్ట్రిక్ బైక్ను రూపొందించాలని అనుకున్నాడు.

తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. తమ కుమారుడి ఆలోచన పట్ల అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమారుడికి అన్ని రకాలుగా మద్ధతుగా నిలిచి ప్రోత్సహించారు. దీంతో ప్రతమేష సుతారా ఎలక్ట్రిక్ బైక్ తయారీకి ఉపయోగించే అన్ని రకాల స్క్రాప్ వస్తువులను సేకరించడం ప్రారంభించాడు. అతడి తండ్రి ప్రకాష్ సుతారా, స్వతహాగా ఎలక్ట్రీషియన్ కావడంతో తన ఆవిష్కరణకు కలిసొచ్చింది. ఎలక్ట్రిక్ బైక్ తయారీకి కావాల్సిన కొన్ని ముడి పదార్థాలను తన తండ్రి గ్యారేజ్ నుండి సేకరించాడు. వీటితో పాటు లిడ్ యాసిడ్ 48 వోల్టేజ్ బ్యాటరీ, 48 వోల్టేజ్ మోటారు, 750 వాట్ మోటారులను కొనుగోలు చేసి ఎలక్ట్రిక్ రీఛార్జిబుల్ బైక్ను రూపొందించాడు.

25 వేలతోనే ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరణ..
న్యూస్ 18 తో ప్రతామేషా సుతారా మాట్లాడుతూ “లాక్డౌన్ సమయంలో పాఠశాలలు మూసివేయబడటంతో ఇంట్లో ఖాళీగా ఉన్నాను. ఈ సమయాన్ని ఏదైనా ఆవిష్కరణకు ఉపయోగించుకోవాలని అనుకున్నాను. నా ఆవిష్కరణకు ఎలక్ట్రిక్ బైక్ సరైనదని నిర్ణయించుకున్నా. ప్రస్తుత తరుణంలోఎలక్ట్రిక్ బైక్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలు ఎలక్ట్రిక్ బైక్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అందువల్ల, తక్కువ ఖర్చుతో నేనే స్వయంగా ఒక ఎలక్ట్రిక్ బైక్ను రూపొందించాలని అనుకున్నా. ఈ బైక్ రూపకల్పనలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న నా తండ్రి ఎంతగానో సహకరించారు. ఆయన ప్రోత్సాహంతోనే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించాను. మరికొన్ని విషయాలను గూగుల్‌లో వెతికి తెలుసుకున్నాను.” అని అన్నాడు.

ప్రతామేష బైక్ తయారీకి కేవలం రూ .25 వేలు మాత్రమే ఖర్చు అయిందని పేర్కొన్నాడు. మార్కెట్లో లభించే ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే ఇది చాలా చౌకగా లభిస్తుందని తెలిపాడు. ఈ బైక్ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 40 కి.మీ ఉంటుంది. దీనిలో రివర్స్ గేర్ ఆప్షన్ను కూడా పొందుపర్చాడు. తన కుమారుడి నూతన ఆవిష్కరణపై ప్రకాష్ సుతారా మాట్లాడుతూ “నా కుమారుడు కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ను రూపొందించడం పట్ల ఎంతో గర్వంగా ఉంది. స్వతహాగా నేను ఎలక్ట్రీషియన్ అయినప్పటికీ, నాకు దాని మెకానిజం గురించి పెద్దగా తెలియదు. నా కుమారుడు గూగుల్లో పరిశోధన చేసి తనే స్వయంగా ఎలక్ట్రిక్ బైక్ను రూపొందించాడు. ఏదో ఒక రోజు అతను పెద్ద ఆవిష్కరణను చేస్తాడని ఆశిస్తున్నాను.”అని అన్నాడు.
Published by:Hasaan Kandula
First published: