హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఇదెక్కడి విడ్డూరమ్మా : పెగ్నెంట్ అన్న సంగతి ఆ బాలికకు తెలీదు..స్కూల్ కి వెళ్దామని రెడీ అవుతుంటే పిల్లోడు పుట్టాడు

ఇదెక్కడి విడ్డూరమ్మా : పెగ్నెంట్ అన్న సంగతి ఆ బాలికకు తెలీదు..స్కూల్ కి వెళ్దామని రెడీ అవుతుంటే పిల్లోడు పుట్టాడు

అలెక్సిస్

అలెక్సిస్

15 Year old girl delivers baby : పెళ్లయిన ఏ స్త్రీకైనా తల్లి(Mother) కావాలనే ఆనందం చాలా ప్రత్యేకమైనది. ఆమె తన బిడ్డను మొదటిసారి చూసినప్పుడు, అది ఆమె జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు అవుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

15 Year old girl delivers baby : పెళ్లయిన ఏ స్త్రీకైనా తల్లి(Mother) కావాలనే ఆనందం చాలా ప్రత్యేకమైనది. ఆమె తన బిడ్డను మొదటిసారి చూసినప్పుడు, అది ఆమె జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు అవుతుంది. కానీ స్త్రీ అవివాహితగా ఉన్నప్పుడు, ఆమె గర్భవతి(Pregnant) అని తెలిసినప్పుడు ఈ ఆనందం విచారంగా మారుతుంది. కేవలం 15 ఏళ్లు ఉన్న ఓ అమ్మాయికి తాను గర్భవతి అన్న విషయం బిడ్డ పుట్టిన తర్వాత(Delivery) తెలిస్తే ఆ అమ్మాయికి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు ఊహించండి. అలాంటి ఒక వింత అనుభవాన్ని ఒక అమ్మాయి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది తెలిసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

డైలీ స్టార్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం..అలెక్సిస్ అనే 19 ఏళ్ల అమ్మాయి సోషల్ మీడియా సైట్ టిక్‌టాక్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల అలెక్సిస్ చాలా విచిత్రమైన సంఘటన గురించి చెబుతూ వీడియోను పోస్ట్ చేసింది. తనకు 15 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే బిడ్డకు జన్మనిచ్చినట్లు అలెక్సిస్ ఆ వీడియోలో తెలిపారు. కానీ తాను గర్భవతి అన్న విషయం తనకు తెలియదని..తన పొట్ట కూడా బయటకు రాలేదు, పీరియడ్స్ ఆగలేదని చెప్పింది. తన గర్భం నిగూఢంగా ఉందని, అది గుర్తించబడలేదని తెలిపింది.

Lottery : నీ అదృష్టం మాములుది కాదు భయ్యో..ఆటో డ్రైవర్ కి లాటరీలో రూ.25 కోట్లు

15 సంవత్సరాల వయస్సులో తల్లి, గర్భం గురించి తెలియదు

అలెక్సిస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో..15 సంవత్సరాల వయస్సులో నేను ఓ రోజు స్కూల్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నాను. ఆ రోజు వెన్ను నొప్పిగా ఉండడంతో పెయిన్ కిల్లర్ తీసుకున్నాను. వెన్నునొప్పి గురించి తల్లిదండ్రులకు చెప్పగా. పాఠశాలకు వెళ్లకుండా సాకులు చెబుతోందని నన్ను స్కూల్ కి పంపేందుకు మళ్లీ సిద్ధం చేయడం ప్రారంభించారు. నేను యూనిఫాం ధరించి, టాయిలెట్‌కి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా కడుపులో చాలా నొప్పి వచ్చింది. ఆమె ఒక పిల్లవాడి తల కనిపించడం చూసి భయపడిపోయి వెంటనే అరవడంతో మా అమ్మ వచ్చింది. నేను బిడ్డకు జన్మనివ్వబోతునన్నానని తెలిసి మా అమ్మ షాక్ అయింది. మా నాన్న గందరగోళానికి గురై వెంటనే మార్కెట్ నుండి గర్భ పరీక్ష కిట్‌లను తీసుకొచ్చాడు. నా కడుపులో బిడ్డ ఉన్నట్లు గుర్తించారు. దీని తరువాత ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. గర్భవతిగా ఉన్నప్పుడు తన తల్లికి కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయని అలెక్సిస్ చెప్పారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Viral in internet, Viral post

ఉత్తమ కథలు