స్కూళ్లో చేరిన గొర్రెలు...పిల్లలతో పాటు అడ్మిషన్‌లు..

వాటి బర్త్ సర్టిఫికెట్లు చూపించి అధికారికంగా అడ్మిషన్ తీసుకున్నారు. వాటికి పేర్లు పెట్టి స్కూల్ రిజిస్టర్‌లో పేర్లను నమోదు చేశారు. ఆ గొర్రెల్లో ఒకదాని పేరు బాబెటి కాగా..మరోదాని పేరు సాటే మౌటన్..!

news18-telugu
Updated: May 10, 2019, 1:20 PM IST
స్కూళ్లో చేరిన గొర్రెలు...పిల్లలతో పాటు అడ్మిషన్‌లు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వచ్చే నెలలో మన దగ్గర స్కూళ్ల గోల మొదలవుతుంది. కొత్త క్లాసులు, కొత్త పుస్తకాలతో సందడి చేస్తారు విద్యార్థులు. స్కూల్ అంటే విద్యార్థులు, టీచర్లు మాత్రమే ఉంటారు. కానీ ఓ స్కూళ్లో 15 గొర్రెలు అడ్మిషన్ తీసుకున్నాయి. అదేదో గొర్రెలను మేపే కేంద్రం అనుకుంటే పొరపాటే....! పిల్లలు చదవుకునే పాఠశాలలోనే గొర్రెలు కూడా చేరాయి. వారితో పాటు రిజిస్టర్‌లో పేర్లను నమోదు చేసుకున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా...ఇది నిజం..! ఫ్రాన్స్‌లో ఓ మారుమూల ప్రాంతంలోని స్కూళ్లో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఆల్ప్స్ పర్వత శ్రేణిలో క్రెట్సిన్ బెలడోని గ్రామంలో ఓ స్కూల్ ఉంది. ఆ పాఠశాలలో 11 క్లాసులు నడుస్తున్నాయి. ఐతే ఇటీవల స్కూళ్లో విద్యార్థుల సంఖ్య పడిపోయింది. ఐతే 266 నుంచి 261 మందికి విద్యార్థుల సంఖ్య పడిపోతే ఏదో ఒక క్లాస్‌ను మూసేస్తామని.. స్కూలు యాజమాన్యం తల్లిదండ్రులకు స్పష్టం చేసింది. అదే జరిగితే తమ పిల్లల భవిష్యత్ అంధకారమవుతుందని...ఓ విద్యా సంవత్సరం కోల్పోవాల్సి వస్తుందని విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన చెందారు.

ఈ క్రమంలోనే 15 గొర్రెలను తీసుకెళ్లి స్కూళ్లో చేర్పించారు స్థానికులు. వాటి బర్త్ సర్టిఫికెట్లు చూపించి అధికారికంగా అడ్మిషన్ తీసుకున్నారు. వాటికి పేర్లు పెట్టి స్కూల్ రిజిస్టర్‌లో పేర్లను నమోదు చేశారు. ఆ గొర్రెల్లో ఒకదాని పేరు బాబెటి కాగా..మరోదాని పేరు సాటే మౌటన్..! గొర్రెల అడ్మిషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తంచేశారు. ఇప్పుడు తమకు ప్రశాంతంగా ఉందని.. క్లాసులను రద్దుచేసే అవకాశమే ఉండదని చెప్పారు. ఈ సందర్భంగా జాతీయ విద్యామండలి తీరుపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్ కంటే సంఖ్యే వారికి ముఖ్యమయిందని మండిపడ్డారు.
First published: May 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>