ధాయిలాండ్ రాజు ఉంపుడుగత్తె సినీనత్ వంగవజిరపాక్డికి సంబంధించిన నగ్న చిత్రాలు వెలుగుచూశాయి. సుమారు 1400 చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని డెయిలీ బీస్ట్ తెలిపింది. అయితే, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని భావిస్తున్నారు. రాజకుటుంబంలో చిచ్చు పెట్టడానికి జరిగిన కుట్రగా అనుమానిస్తున్నారు. 2012 నుంచి 2014 మధ్య ఈ చిత్రాలు తీసినట్టు చెబుతున్నారు. అందులో చాలా చిత్రాలు చాలా ఆంతరంగికమైనవి ఉన్నాయి. కొన్ని చిత్రాల్లో ఆమె టాప్ లెస్‌గా ఉందని, మరికొన్ని చిత్రాల్లో ఆమె నైట్ డ్రెస్ వేసి ఉంది. నాలుగు ఐఫోన్లలో తీసిన ఈ ఫొటోలు తనకు అందినట్టు బ్రిటిష్ జర్నలిస్ట్ ఆండ్రూ మెక్ గ్రెగోర్ మార్షల్ తెలిపారు. అలాగే, థాయ్ విద్యావేత్త పవిన్ చచావల్పాంగ్పన్కు కూడా ఈ ఫొటోలు అందాయి. ‘సుమారు 1400 ఫొటోలు ఉన్నాయి. నాలుగు ఐఫోన్లతో తీసినవి. వాటిని నేను పబ్లిష్ చేయకూడదని నిర్ణయించా. ఎందుకంటే దీనికి ఆమె అనుమతి తీసుకోలేదు. అయితే, దీని వెనుక ఏదో కుట్ర ఉందనిపిస్తోంది.’ అని ఆండ్రూ తెలిపాడు. అయితే, ఆ ఫొటోల్లో ఎక్కువ శాతం ఆమె తనంతట తానే తీసుకున్నట్టుగా ఉందని ఆండ్రూ అభిప్రాయపడ్డాడు. బహుశా ఆ చిత్రాలను రాజు వజిరలోంగ్కార్న్ను పంపడానికి తీసుకుని ఉండొచ్చని తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడు.
ధాయిలాండ్ రాజు భార్య, ఉంపుడుగత్తె మధ్య వైరం ఉంది. ఈ క్రమంలో ఆమె ఫొటోలు బయటకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమెను బద్ నాం చేయడానికే ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ధాయిలాండ్ రాజు మహా వజిరలోంగ్‌కోర్న్ 2019 సంవత్సరంలో ఆమెను తన ఉంపుడుగత్తెగా నియమించారు. సినీనత్ పైలెట్ శిక్షణ తీసుకుంది. ఆమె ధాయిలాండ్, ఇతర దేశాల్లో కూడా ట్రైనింగ్ తీసుకుంది. అలాగే, రాజు రాయల్ బాడీగార్డుగా, రాజు గారి గార్డుగా మేజర్ జనరల్ ర్యాంక్ పదవిలో పనిచేసింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:December 23, 2020, 19:12 IST