పాకిస్థాన్‌లో ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు... 14 మంది మృతి... ఎలా జరిగిందంటే...

Pakistan Train Collision : ప్రపంచవ్యాప్తంగా రైలు ప్రమాదాలు దాదాపు తగ్గాయి. ఇలాంటి సమయంలో... పాకిస్థాన్‌లో జరిగిన ప్రమాదం మరోసారి రైళ్ల ప్రమాదాలపై చర్చ జరిగేలా చేస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 11, 2019, 3:00 PM IST
పాకిస్థాన్‌లో ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు... 14 మంది మృతి... ఎలా జరిగిందంటే...
పాకిస్థాన్‌లో రైలు ప్రమాద దృశ్యాలు (Image : Twitter)
  • Share this:
పాకిస్థాన్‌లో రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 14 మంది చనిపోగా... మరో 79 మంది గాయాలపాలయ్యారు. అసలీ ప్రమాదం జరగకుండా ఉండేదే. టెక్నికల్ లోపం వల్ల జరిగినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం సాధిఖాబాద్ దగ్గర్లో రోజూలాగే... వల్హర్ గ్రామం దగ్గర వేగంగా వస్తోంది అక్బర్ ఎక్స్‌ప్రెస్. సరిగ్గా అదే ట్రాక్‌పై ఉన్న గూడ్సురైలును బలంగా ఢీకొంది. ఈ ఘటనలో పదిమంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాదంలో రైలు చాలా గట్టిగా ఢీకొట్టడం వల్ల బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కేశాయి. బోగీలను హైడ్రాలిక్ కట్టర్ల సాయంతో తొలగిస్తున్నారు.


కొన్ని బోగీలు పూర్తిగా తుక్కుతుక్కయ్యాయి. వాటి స్వరూపమే పూర్తిగా మారిపోయింది. అందుకే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు పాక్ రైల్వేశాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంతాపం తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు.
ప్రపంచంలో ఇండియా సహా చాలా దేశాలు... అత్యాధునిక రైల్వే వ్యవస్థల్ని అభివృద్ధి చేసుకుంటున్నాయి. ప్రమాదాల నివారణలో ఇదివరకటి కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పాకిస్థాన్ మాత్రం ఇప్పటికీ పాతకాలపు సిగ్నలింగ్ వ్యవస్థలతోనే నెట్టుకొస్తోంది. ఈ ప్రమాదాన్ని చూసైనా పాలకులు ఈ దిశగా ఆలోచించాలంటున్నారు నెటిజన్లు.
First published: July 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు