Home /News /trending /

13YEAR OLD BOY HAS DIED WHILE PERFORMING A SUPERMAN STUNT IN NOIDA SNR

OMG: 13ఏళ్ల బాలుడు సూపర్‌మ్యాన్ స్టన్ట్ చేయబోయాడు..కుటుంబ సభ్యుల కళ్ల ముందే..

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

OMG:సినిమాలు, టీవీ షోలు చూసి ఆ పిల్లాడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. సూపర్‌మ్యాన్‌లా గాల్లో ఎగిరి దూకాలని ప్రయత్నించాడు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే స్టంట్ ఫెయిల్‌ కావడంతో ఊపిరాడక చనిపోయాడు.

సోషల్ మీడియా(Social media)లో చూసే వీడియోలు, కొందరు చేసే స్టంట్స్, ఫన్నీ క్యారెక్టర్స్ నిజ జీవితంలో చేయాలని చూస్తే ప్రమాదం తప్పదు. సెల్ఫీల కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి చేస్తున్న లైవ్ వీడియోలతో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. నొయిడాలో ఇదే తరహా ఘటన ఒకటి ఓ కుటుంబాన్ని కన్నీటి సంద్రంగా మార్చింది. పదమూడేళ్ల(13years old) పిల్లవాడు సూపర్‌మ్యాన్‌(Superman stunt)లా ఎగరగడానికి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన స్థానికంగా అందర్ని కలచి వేసింది. నొయిడా(Noida) సెక్టర్‌ 122 పృథ్లా(Prithla)గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. 13సంవత్సరాల సురజిత్(Surajeet)అనే స్టూడెంట్(Student) కుటుంబ సభ్యులు చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు.

స్టన్ట్ చేయబోయి..
సూపర్‌మ్యాన్‌ అంటే పిల్లలకు ఎంతో క్రేజ్. గాల్లో ఎగరడం, పెద్ద భవనాలపై నుంచి దూకడం వంటివి చేస్తుంటాడని సూపర్‌మ్యాన్‌ని చాలా మంది పిల్లలు ఇష్టపడతారు. పృథ్లా గ్రామానికి చెందిన సురజిత్ కూడా అంతే చేశాడు. తన ఐదుగురు అక్కచెల్లళ్లతో ఇంట్లో ఆడుకుంటున్న క్రమంలోనే వాళ్లను తన గెటప్‌తో మెప్పించాలని సూపర్‌మ్యాన్‌గా మారిపోయాడు. ఓ చెక్క బల్లపై నిల్చొని డైలాగ్ చెప్పాడు. టీ షర్ట్‌పైన సూపర్‌మ్యాన్‌ గాల్లో ఎగురుతుంటే వీపు వెనుక భాగంలో పారాచూట్‌లా ఉండేందుకు ఓ క్లాత్‌ని మెడకు కొట్టుకొని ముడివేశాడు.

ప్రాణాలతో ఆటలొద్దు..
సురజిత్ డైలాగ్ చెప్పుతున్నంత వరకు అతని అక్క, చెల్లెళ్లు లైవ్ వీడియో తీసే పనిలో ఉన్నారు. ఎత్తుగా ఉన్న బల్లపై నుంచి కిందకు దూకిన సమయంలో సురజిత్ మెడకు కట్టుకున్న ముడి బిగుసుపోయింది. వెంటనే ఊపిరాడక అవస్థలు పడుతుంటే అక్కడే ఉన్న అక్కలు వెంటనే వచ్చి మెడకు చుట్టుకున్న క్లాత్‌ని విప్పదీసేందుకు ప్రయత్నించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వాళ్లు ఆసుపత్రికి తరలించారు. చాలా సేపు టవల్‌ ముడి గొంతుకు చుట్టుకొని ఉండటంతో ఊపిరాడక చనిపోయాడు సురజిత్. ఇంట్లో ఐదుగురు ఆడపిల్లల్లో ఒకే ఒక మగపిల్లవాడు పుడితే ఆ విద్యార్ధి సూపర్‌మ్యాన్‌ స్టంట్‌ చేస్తూ ప్రాణాలు కోల్పోవడం చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Noida, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు