13 Injured in Brooklyn Subway Station Shooting: అమెరికాలో మరోసారి ఉలిక్కిపడింది. బ్రూక్లిన్ లోని సబ్ వే స్టేషన్ లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కళ్ల ముందే ప్రజలు పరుగులు తీశారు. ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారి దుస్తులు అన్ని రక్తంతో నిండిపోయాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా అంబులెన్స్ లను ఏర్పాటు చేశారు.
ఆ ప్రాంత మంతా భయంకరంగా మారిపోయింది. ప్రజలు.. రైల్వే స్టేషన్ (Railway station) నుంచి బయటకు పరుగులు తీశారు. కాల్పులు ఉదయం చోటు చేసుకున్నాయి. ఘటన సమయంలో ప్రయాణికుల రద్దీ రైల్వేస్టేషన్ లో ఎక్కువగా ఉంది. వెంటనే అధికారులున రైళ్లను నిలిపివేశారు. బ్రూక్లిన్ లోని 36 వ స్ట్రీట్ సబ్వేలో (Brooklyn Subway Station) వేరే ఎలాంటి పేలుగు పదార్థాలు లభించలేదు.
పోలీసులు అణువణువు జల్లెడ పడుతున్నారు. మెట్రో కోచ్ నేలపై రక్తపు మరకులు కనిపిస్తున్నాయి. ఒక ఆగంతకుడు కార్మికుల యూనిఫాం ధరించి కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. అమెరికా ప్రెసిడెంట్ జోబైడేన్ దీన్ని ఖండించారు. అమెరికాలో గన్ కల్చర్ ను నియంత్రణకు పకట్భంది చర్యలు తీసుకొవాలన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమారాలను పరిశీలిస్తున్నారు.
గతంలో లాస్ వేగాస్ లోను కాల్పులు చోటు చేసుకున్నాయి.
Las Vegas Lounge Shooting : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:15 గంటలకు లాస్ వెగాస్ ఈస్ట్ సహారా అవెన్యూలోని 900 బ్లాక్ లో హుక్కా లాంజ్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. హుక్కా లాంజ్‌లో జరిగిన పార్టీలో ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగిందని,గొడవ పెద్దదవడంతో ఇద్దరు కాల్పులకు తెగబడ్డారని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.