Home /News /trending /

12YEAR OLD BOY DESCRIBING THE DEPLORABLE CONDITION OF A GOVERNMENT SCHOOL IN JHARKHAND VIDEO GOING VIRAL SNR

Viral video : ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుందో బయటపెట్టిన విద్యార్ధి .. వైరల్ అవుతున్న వీడియో ఇదే చూడండి

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Viral video: తెలివి తేటలు,సామాజిక అంశాలపై చిన్న పిల్లల్లో పెరుగుతున్నఅవగాహనకు అద్దం పడుతోంది ఓ వీడియో. జార్ఖండ్‌లో ఓ 12సంవత్సరాల బాలుడు ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితుల్ని , చదువుకునేందుకు వచ్చే విద్యార్ధులకు ఎదురవుతున్న సమస్యలను కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. ఇప్పుడు ఈవీడియోనే పాలకులను ప్రశ్నిస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Jharkhand, India
తెలివి తేటలు,సామాజిక అంశాలపై చిన్న పిల్లల్లో పెరుగుతున్నఅవగాహనకు అద్దం పడుతోంది ఓ వీడియో(Video). జార్ఖండ్‌(Jharkhand)లో ఓ 12సంవత్సరాల బాలుడు ప్రభుత్వ పాఠశాల(Government school)లో పరిస్థితుల్ని , చదువుకునేందుకు వచ్చే విద్యార్ధులకు ఎదురవుతున్న సమస్యలను కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. ఇప్పుడు ఈవీడియోనే పాలకులను ప్రశ్నిస్తోంది. ప్రజల్ని ఆలోచింపజేస్తోంది. 75సంవత్సరాల స్వంతంత్ర భారతదేశంలో మనం సాధించిన ఘనత ఇదేనా అనే విమ్శల్ని నెటిజన్లు(Netizens)సంధిస్తున్నారు.

Viral Video : 14ఏళ్ల బాలుడి శవాన్ని 25కిలోమీటర్లు భుజంపై మోసుకెళ్లాడు .. ఇదిగో వీడియో



పిల్లాడు కాదు బాలమేధావి..
సమాజంలో వెలుగులోకి రాని కొన్ని వేల సమస్యలు ప్రజల్ని వేధిస్తున్నాయి. ప్రజల పక్షాన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన మీడియా చోద్యం చూస్తుంటే..12ఏళ్ల బాలుడు తమ సమస్యను ప్రజలకు తెలియజేయడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు అందర్ని ఆకట్టుకుంటోంది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే జార్ఖండ్ రాష్ట్రం గొడ్డా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల దగ్గర నుంచి లైవ్ రిపోర్ట్ చేసిన 12బాలుడి వీడియో చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియోనే విపరీతంగా వైరల్ అవుతోంది.

వీడియో వైరల్..
జార్థండ్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.12 ఏళ్ల బాలుడు తన పాఠశాలలోని సమస్యలన్నింటినీ బయటపెట్టాడు. పాఠశాలలో ఉపాధ్యాయులు లేరు. విద్యార్ధులు తాగడానికి మంచినీరు ఏర్పాటు చేయలేదు. సరైన బాత్రూం లేకపోవడంతో ఆడపిల్లలు మలవిసర్జన కోసం బయటికి వెళ్లాల్సి వస్తోందంటూ ఒకటి రెండు కాదు సుమారు 10సమస్యలను ఏకరవు పెట్టాడు. తాగి పాడేసిన ఓ కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకొని ఓ జర్నలిస్ట్ రేంజ్‌లో సమస్యల్ని సంధించాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇదంతా వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అంతే కాదు స్కూల్ దగ్గర టీచర్లు ఎవరూ లేకపోవడం...తలుపులు తీసివున్న క్లాస్‌ రూమ్‌లోకి వెళ్లి మరీ రిపోర్టింగ్ చేశాడు. అక్కడున్న చిన్న బాలుడ్ని ఎందుకు స్కూల్‌లో ఎవరూ లేరు..? ఎందుకని విద్యార్ధులు రావడం లేదని ప్రశ్నించి అతనితోనే సమాధానం చెప్పించాడు.

Viral video : ఇద్దరు కూతుళ్లపై తండ్రి అత్యాచారం .. బయటపెట్టినందుకు ఏం జరిగిందో ఈ వీడియో చూడండి



సర్కారు దృష్టికి సమస్యలు..
భిఖియాచక్‌లోని అప్‌గ్రేడ్ చేసిన ప్రాథమిక పాఠశాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని...విద్యార్ధుల గురించి పట్టించుకోండి అంటూ జార్ఖాండ్‌ విద్యాశాఖ మంత్రికి విన్నవించుకుంటూ చేసిన వీడియోని నెటిజన్లు అన్నీ గ్రూప్‌లలో షేర్ చేస్తున్నారు. మంత్రిగారు చిన్నపిల్లవాడు చెప్పిన సమస్యలను త్వరగా పరిష్కరించండి లేదంటే పరువు పోయే ప్రమాదం ఉందంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Jarkhand, Viral Video

తదుపరి వార్తలు