• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • 111 YEAR OLD AUSTRALIAN DEXTER KRUGER RECOMMENDS EATING CHICKEN BRAINS HE SAYS IT IS HIS LONG LIFE SECRET SK

Chicken Brain: కోడి మెదడు.. 111 ఏళ్లు ఆ వృద్ధుడి దీర్ఘాయువు రహస్యం ఇదే

Chicken Brain: కోడి మెదడు.. 111 ఏళ్లు ఆ వృద్ధుడి దీర్ఘాయువు రహస్యం ఇదే

డెక్స్‌టర్ క్రుగర్ (Image:AP)

తాను కోడి మెదను చాలా ఇష్టంగా తింటానని.. అందువల్లే ఇంత కాలం జీవించి ఉన్నానని ఆయన చెప్పారు. ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నానని పేర్కొన్నారు.

  • Share this:
    ఈ కంప్యూటర్ యుగంలో మనిషి సగటు వయసు 70 ఏళ్లకు మించి ఉండడం లేదు. చాలా తక్కువ మంది మాత్రమే 80 ఏళ్లకు మించి బతుకుతున్నారు. ఇక శతాధిక వృద్ధులు కోటికొకరు మాత్రమే కనిపిస్తారు. ఐతే ఆస్ట్రేలియాలో ఓ వృద్ధుడు 111 ఏళ్లుగా జీవించి ఉన్నారు. ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. వందేళ్లకు పైగా బతుకుతున్న ఈ పెద్దాయన దీర్ఘాయువు రహస్యమేంటన్న ప్రశ్నలు అందరిలోనూ కలుగుతాయి. ప్రస్తుతం కాలుష్య ప్రపంచంలో అన్నేళ్లు బతకడమంటే మాటలు కాదు. మరి వారి ఆహారపు అలవాట్లు ఏంటి? అన్నేళ్లు ఎలా బతక గలుగుతున్నారో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. ఈ ప్రశ్నలకు ఆ శతాధిక వృద్ధుడు ఎవరూ ఊహించని సమాధానం చెప్పారు. అదే.. కోడి మెదడు. అవును.. కోడి మెదడు తినడం వల్లే తాను ఇన్నేళ్లుగా ఆరోగ్యంగా జీవిస్తున్నట్లు తెలిపారు.


    ఆస్ట్రేలియాలోని రోమాకు చెందిన డెక్స్‌టర్ క్రుగర్ వయసు 111 ఏళ్లు. ఆయనకు పశు సంపద చాలా ఉండేది. ఎద్దులు, గొర్రెలు, మేకలు, కోళ్లు బాగా పెంచేవారు. అంతకు ముందు పశు సంపదను వృద్ధి చేసే విభాగంలోనూ పనిచేశారు. ఇటీవల 111 ఏళ్లు పూర్తి కావడంతో ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు డెక్స్‌టర్ క్రుగర్. అందులో తన దీర్ఘాయువుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను కోడి మెదను చాలా ఇష్టంగా తింటానని.. అందువల్లే ఇంత కాలం జీవించి ఉన్నానని చెప్పారు. ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నానని పేర్కొన్నారు.

    ''కోడికి తల ఉంటుందని మాత్రమే మనకు తెలుసు. అయితే ఆ తలలో మెదడు ఉంటుంది. అది రుచికరంగా ఉండే చిన్న పదార్థం. చాలా తక్కువ పరిమాణంలోనే ఉంటుంది." అని డెక్స్‌టర్ క్రుగర్​ తెలిపారు. తన జీవిత విశేషాలపై ఓ ఆత్మకథ కూడా రాశానని చెప్పుకొచ్చారు. సాధారణ జీవనశైలే తండ్రి దీర్ఘాయువుకు కారణమని.. ఆయన చాలా సింపుల్‌గా ఉంటారని క్రుగర్ కుమారుడు గ్రెగ్ పేర్కొన్నారు. ఇప్పటికీ ఆయనకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉందని తెలిపారు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం అత్యధిక వయసున్న వ్యక్తి డెక్స్‌టర్ క్రుగర్ అని ఆస్ట్రేలియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపకుడు జాన్ టేలర్ వెల్లడించారు.


    కాగా, ఆస్ట్రేలియాలో అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా క్రిస్టినా కుక్ పేరు మీద రికార్డు ఉంది. 2002లో మరణించిన ఆయన.. 114 ఏళ్ల 148 రోజుల పాటు జీవించారు. మరో నాలుగేళ్లు జీవిస్తే ఆయన పేరిట ఉన్న రికార్డును డెక్స్‌టర్ క్రుగర్ అధిగమిస్తారు. ఐతే ఆయన దీర్ఘాయువు రహష్యం కోడి మెదడని చెప్పి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మనదేశంతో పాటు చాలా చోట్ల కోడి మెదడును అస్సలు తినరు. వాటిని చికెన్ వ్యర్థాలుగా బయట పారబోస్తారు. అలాంటి కోడి మెదడును తిని.. ఏకంగా 111 ఏళ్లుగా జీవించి ఉండడం.. నిజంగా ఆశ్చర్యమే..!
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు