హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Sakhibala Mandal: 110 ఏళ్ల బామ్మకు కొత్తగా వచ్చిన దంతాలు, వెంట్రుకలు .. ఈ ఆశ్చర్యకర ఘటన ఎక్కడ జరిగిందంటే..?

Sakhibala Mandal: 110 ఏళ్ల బామ్మకు కొత్తగా వచ్చిన దంతాలు, వెంట్రుకలు .. ఈ ఆశ్చర్యకర ఘటన ఎక్కడ జరిగిందంటే..?

old women birthday(file)

old women birthday(file)

Sakhibala Mandal:ప్రస్తుత ప్రపంచంలో యుక్తవయసులోనే చాలా మందికి జుట్టు రాలిపోతోంది. ఉన్న జుట్టును కాపాడుకోవడానికి నానాయాతనా పడుతున్నారు. అలాంటిది ఓ వృద్ధురాలికి 110 ఏళ్ల వయసులో కొత్తగా జుట్టు పెరిగింది, దంతాలు వచ్చాయి. ఈ ఘటన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • West Bengal, India

ప్రస్తుత ప్రపంచంలో యుక్తవయసులోనే చాలా మందికి జుట్టు రాలిపోతోంది. ఉన్న జుట్టును కాపాడుకోవడానికి నానాయాతనా పడుతున్నారు. అలాంటిది ఓ వృద్ధురాలికి 110 ఏళ్ల వయసు(110years)లో కొత్తగా జుట్టు పెరిగింది, దంతాలు వచ్చాయి. ఈ ఘటన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ వృద్ధురాలికి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. ఇంతటి ఆశ్చర్యకరమైన సంఘటన పశ్చిమ్‌ బెంగాల్‌ (West Bengal), రామచంద్రాపూర్‌లోని బడ్జ్ బడ్జ్‌లో ఈ వింత జరిగింది. ఆ వృద్ధురాలి పేరు సఖిబాలా మోండల్(Sakhibala Mandal).

Video Viral: బైక్‌పై ప్రేమజంట రొమాంటిక్ రైడ్ .. వైరల్ అవుతున్న వీడియో ఇదే

110 ఏళ్లకు కొత్తగా జుట్టు, దంతాలు

110సంవత్సరాల వృద్ధురాలికి ఆమెకు కొత్తగా జట్టు, దంతాలు రావడంతో పుట్టిన రోజులు నిర్వహించారు. యాదృచ్ఛికంగా ఆ సమయంలో అక్కడ ‘దీదీర్ దూత్’ నిర్వాహకులు ఉన్నారు. ఈ పుట్టినరోజు వేడుకలో వారు కూడా పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)తో నేరుగా కనెక్ట్ కావడానికి 'దీదీర్ దూత్' అనే మొబైల్ అప్లికేషన్ లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. పుట్టినరోజు వేడుకలో బడ్జ్ బడ్జ్ నంబర్ 2 బ్లాక్ వైస్ ప్రెసిడెంట్ బుచన్ బెనర్జీ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. బుచ్చన్ బెనర్జీ మాట్లాడుతూ.. స్థానికులకు అమ్మమ్మ ఆశీస్సులు, మమతా బెనర్జీ పాలన అండగా ఉంటాయన్నారు. బర్త్‌డే పార్టీకి హాజరవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆ ప్రాంతంలో స్వీట్లు కూడా పంపిణీ చేశారు.

ఆమె మరికొన్ని రోజులు ఆనందంగా జీవించాలి

సఖిబాలా మోండల్ 110 సంవత్సరాల వయసులో పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. సఖిబాలా మోండల్‌ 80 ఏళ్ల కుమార్తె, మనవడు, మనవరాలు, వారి కుమారులు, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు. కేక్‌లు కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం సఖిబాలా మోండల్‌కు శాఖాహారం తినిపించారు. వృద్ధురాలు మరికొన్ని రోజులు ఆనందంగా జీవించాలని కోరుకున్నారు.

అరుదే.. కానీ అసాధ్యం కాదు

వృద్ధురాలికి కొత్త జుట్టు, దంతాలు రావడంపై దంతవైద్యుడు శ్యామల్ సేన్ మాట్లాడారు. ఇలా వృద్ధులకు కొత్తగా దంతాలు, జుట్టు రావడం చాలా అరుదైన అంశం, కానీ అసాధ్యం కాదు. ఒక సంవత్సరం క్రితం ఘటల్ వద్ద 100 సంవత్సరాల వయస్సు గల స్త్రీకి కొత్త దంతాలు వచ్చాయి. క్షీరదాలకు కొత్త వెంట్రుకలు, దంతాలు ఎప్పుడైనా పెరిగే అవకాశం ఉంది. అయితే సాధారణంగా వృద్ధాప్యంలో కొత్త దంతాలు పెరగడానికి శరీరానికి అవసరమైన గరిష్ట కాల్షియం, ఇతర మినరల్స్‌ కోల్పోతారు. కాబట్టి ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి.

First published:

Tags: Old women, VIRAL NEWS, West Bengal

ఉత్తమ కథలు