హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Bihar: సీఎం ముందు గుక్కపట్టి ఏడ్చిన బాలుడు.. క్లిప్పింగ్ వైరల్.. అసలేం జరిగిందంటే..

Bihar: సీఎం ముందు గుక్కపట్టి ఏడ్చిన బాలుడు.. క్లిప్పింగ్ వైరల్.. అసలేం జరిగిందంటే..

తన బాధను సీఎంతో చెప్పుకుంటున్న బాలుడు

తన బాధను సీఎంతో చెప్పుకుంటున్న బాలుడు

Bihar: బాలుడు సీఎం దగ్గరకు వచ్చాడు. ఆ తర్వాత.. తనకు చదువంటే ఇష్టమని సివిల్స్ లో మంచి ర్యాంక్ సాధించి, ఉద్యోగం చేస్తానని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముందు ఏడ్చాడు.

బీహర్ లోని నలందా జిల్లాలో ఒక బాలుడు తన గొడును సీఎం ముందు వెల్లబోసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన క్లిప్పింగ్స్ లు వైరల్ గా మారాయి. శనివారం సీఎం నితీష్ కుమార్, తన భార్య వర్ధంతి సభకు హజరయ్యేందుకు కళ్యాణ్ బిఘ అనే గ్రామానికి వెళ్లారు. అప్పుడు సోను అనే 11 ఏళ్ల బాలుడు, నితిష్ కుమార్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఆయనకు తాను పడుతున్న ఆవేదనను చెప్పుకున్నాడు. బాలుడు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. తనకు చదువంటే ఇష్టమని ఇక్కడ ప్రభుత్వ స్కూల్ లో సరైన వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ప్రస్తుతం 5 వ తరగతి వరకు పిల్లలకు ట్యూషల్ లు చెబుతున్నానని అన్నాడు.

తనను ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తే.. సివిల్స్ లో ర్యాంకు సాధించి చూపిస్తానని అన్నాడు. ఈ మాటలకు అక్కడక ఉన్న వారు బాలుడి ధైర్యానికి, అతనిలో ఉన్న పట్టుదలకు సీఎం మెచ్చుకున్నారు. తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతను పెంచుతామని అన్నారు. అయితే, తన తండ్రి రణవిజయ్ పెరుగు అమ్ముతూ జీవనం సాగిస్తాడని తెలిపాడు. ఆయన తాగుడుకు బానిసయ్యాడని, సంపాదించినంతా తాగుడుకే తగలేస్తాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తమ దగ్గరు ప్రైవేటు పాఠశాలలో చదివేంత డబ్బులేదని దయచేసి నాకు సహాయం చేయాలని సీఎం నితిష్ కుమార్ ను అభ్యర్థించాడు. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్ వైరల్ గా మారింది. కాగా, బీహార్‌లో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి కూడా చాలా తక్కువగా ఉంది.

అధికారిక లెక్కల ప్రకారం.. బీహార్‌లో 72,663 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 42,573 ప్రాథమిక, 25,587 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. 2,286 మాధ్యమిక, 2,217 సీనియర్ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO) 2021లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 56% (మొత్తం 2.2 లక్షల) టీచింగ్ పోస్టులు బీహార్‌లో ఖాళీగా ఉన్నాయి, వీటిలో 89% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రాంతాలు, ఇది దేశంలోనే అత్యధికం.

First published:

Tags: Bihar, Higher education, Nitish Kumar

ఉత్తమ కథలు